Moviesస‌మంత‌ను రు. 15 కోట్ల‌కు నిండా ముంచేసిన అనుష్క‌…!

స‌మంత‌ను రు. 15 కోట్ల‌కు నిండా ముంచేసిన అనుష్క‌…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలపరంగా.. అటు వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు విజయ్ దేవరకొండకు జోడిగా ఆమె నటించిన ఖుషి సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్ లో అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లు కొల్లగొట్టింది అని ఊదరగొట్టేశారు. సోమవారం నుంచి వసూళ్లు మెల్లమెల్లగా డ్రాప్ అవుతూ వచ్చాయి.

ఇంకా చాలా ఏరియాలలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌లోకి రావాల్సి ఉంది. ఒక్క ఓవర్సీస్ లో మాత్రం ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ దాటేసి భారీ లాభాల్లోకి వచ్చేసింది. ఏపీ, తెలంగాణలో చాలా ఏరియాలలో ఈ సినిమా ఇంకా వ‌సూళ్లు రాబట్టాల్సి ఉంది. అయితే ఈరోజు వచ్చిన అనుష్క మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి – షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో రెండింటికి సూపర్ డూపర్ టాక్ వచ్చేసింది. ఖుషి కి నైజంలో ముందు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. సోమవారం నుంచి బాగా డ్రాప్ అయ్యాయి. ఇప్పుడు జవాన్ కు నైజాంలో భీభ‌త్స‌మైన టాక్ వచ్చేసింది. దీనికి తోడు అనుష్క సినిమా కూడా రిలీజ్ అయింది.

ఖుషి ఆడుతున్న చాలా స్క్రీన్లు తగ్గించేసి జవాన్, మిస్‌శెట్టి సినిమాకు ఇచ్చేశారు. మరోవైపు బెదురులంక లాంటి సినిమాలకు కూడా ఇంకా కొన్ని స్క్రీన్లు కంటిన్యూ చేస్తున్నారు. ఏది ఏమైనా అనుష్క సినిమాకు కూడా సూపర్ హిట్ టాక్ రావడం.. ఐదు సంవత్సరాల తర్వాత ఆమె వెండితెరపై కనిపించడంతో ఫ్యామిలీ ప్రేక్షకులు.. అనుష్క అభిమానులు కూడా ఇప్పుడు అనుష్క సినిమా వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖుషిని చూడటం కష్టమే అనుకోవాలి. ఓవరాల్‌గా ఖుషి సినిమాకు రు. 12 నుంచి 15 కోట్ల మధ్యలో నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోలిస్తే చాలా ఏరియాలో నష్టాలు తప్పంటున్నారు. అనుష్క ఎంట్రీ తో సమంతకు పెద్ద దెబ్బ తగిలిందని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news