Moviesచిరంజీవికి జోడీగా ఆ కుర్ర హీరోయిన్ ఫిక్స్‌… కాంబినేష‌న్ అదుర్స్‌…!

చిరంజీవికి జోడీగా ఆ కుర్ర హీరోయిన్ ఫిక్స్‌… కాంబినేష‌న్ అదుర్స్‌…!

మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతికి వాల్తేరు వేరే సినిమాతో బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో పోటీపడిన చిరంజీవి సూపర్ హిట్ కొట్టారు. తాజాగా ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాలో నటించారు. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయింది.

ఇక ప్రస్తుతం చిరంజీవి లైన‌ప్‌లో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. చిరు పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల‌ నిర్మాణ సారథ్యంలో కురసాల కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా రానుంది. ఆ తర్వాత యూవి క్రియేషన్స్ నిర్మించే సినిమాలో చిరు నటించ‌నున్నారు. చిరు కెరీర్లో 157వ‌ ప్రాజెక్ట్గా ఇది తెరకెక్కనుంది. కళ్యాణ్ రామ్ బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.

ఈ సినిమా ఇప్పటికే ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సీతారామం సినిమాలో సీత పాత్రతో మృణాల్‌ ఠాగూర్ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో అలా నిలిచిపోయింది. ఆ సినిమాలో చాలా సాంప్రదాయపద్ధంగా కనిపించిన ఆమె ఆ తర్వాత గ్లామర్‌కు గేట్లు ఎత్తేసింది.

ఇక చిరంజీవి సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో కావాలని మృణాల ఠాకూర్ను ఎంపిక చేసినట్టు సమాచారం. చిరు – మృణాల్‌ కాంబినేషన్ వెండితెరపై ఖచ్చితంగా అదుర్స్ అనేలా ఉంటుందని సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news