Moviesచిరంజీవి-బాలయ్య కాంబో లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.....

చిరంజీవి-బాలయ్య కాంబో లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.. ఎంత దరిద్రం అంటే..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు కలిసి నటించినా.. మల్టీస్టారర్ సినిమాలు వచ్చినా.. ఓ ఇద్దరి హీరోలు మాత్రం తెరపై కనిపిస్తే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక.. ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు టాలీవుడ్ మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి – నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా రావాలని గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో అటు మెగా ఫాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే మొన్న ఆ మధ్య వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రాబోతుంది అని ప్రచారం జరిగినా ..అది మొత్తం ఫేక్ అంటూ తేలిపోయింది. అయితే గతంలో ఓసారి వీళ్లిద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉందని.. కానీ లాస్ట్ మూమెంట్లో ఈ సినిమా వేరే హీరో చేతికి వెళ్లిపోయిందని తెలుస్తుంది . ఆ సినిమా మరేదో కాదు “అపూర్వ సహోదరులు”. కే రాఘవేంద్రరావు గారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ ద్వీపాత్ర అభినయం చేశాడు .

విజయశాంతి – భానుప్రియ ఇందులో హీరోయిన్లుగా నటించి .. తమ అందాలతో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేశారు . 1986 అక్టోబర్ 9న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే నిజానికి ఈ సినిమా ని మొదట మల్టీ స్టారర్ గా అనౌన్స్ చేశారట మేకర్స్. ఇందులో చిరంజీవి – బాలకృష్ణ హీరోలుగా ఎంపిక అయ్యారట . చిరంజీవి బాలకృష్ణ సైతం ఒప్పుకున్నారట. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ లాస్ట్ మినిట్ లో ఈ ప్రాజెక్టు నుంచి చిరంజీవి తప్పుకున్నాడు. దీంతో చిరంజీవి క్యారెక్టర్ కూడా బాలకృష్ణ నే చేసి సినిమాను సూపర్ డూపర్ హిట్ గా మార్చాడు . ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news