Newsచిరు నెక్ట్స్ సినిమా ద‌ర్శ‌కుడు కూడా కొంప కొల్లేరు చేసేటోడేనా...!

చిరు నెక్ట్స్ సినిమా ద‌ర్శ‌కుడు కూడా కొంప కొల్లేరు చేసేటోడేనా…!

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వచ్చిన సినిమా కచ్చితంగా హిట్ కొట్టేవి కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి. రొటీన్‌గా కాకుండా కొత్తగా కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు సినిమాలను చూస్తున్నారు. ఆల్రెడీ వేరే భాషల్లో తీసిన హిట్ సినిమాలను మళ్లీ తీసినా పెద్దగా చూడటం లేదు. మెగాస్టార్ హీరో సినిమానైనా ఫస్ట్ డేనే రిజెక్ట్ చేస్తున్నారు. ఆ విషయం భోళాశంకర్ సినిమాలో నిరూపితమైంది.

ఈ సినిమా విడుదలైన తొలి ఆట‌కే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో చిరంజీవి షాక్ అయ్యాడు. మళ్లీ రీమేక్‌ల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఆగస్టు 10 ముందు వరకు చిరంజీవి వేదాళం రీమేక్ కాకుండానే బ్రో డాడీ రీమేక్ కూడా చేయాలని ప్లాన్ చేశాడు. అతని నెక్స్ట్ మూవీ మలయాళం కామెడీ డ్రామా బ్రో డాడీ స్టోరీతోనే తెరకెక్కుతుందని వార్తలు కూడా వచ్చాయి. ఆల్రెడీ రీమేక్‌ హక్కులు కూడా కొనేసారని టాక్‌ నడిచింది.

అయితే భోళాశంకర్ దెబ్బకు కనువిప్పు కలిగిన చిరు ఈ రీమేక్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. కాగా బ్రో డాడీ కథను కాపీ చేయకుండా కొత్త కథ రాయాలని తాజాగా చిరంజీవి కళ్యాణ్ కృష్ణకు చెప్పారని ప్రచారం మొదలయ్యింది. కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం, నేల టికెట్, బంగార్రాజు వంటి కమర్షియల్ సినిమాలు తీశాడు.

సంక్రాంతి సందర్భంగా కమర్షియల్ ఫార్మాట్లో రిలీజ్ అయిన సోగ్గాడే చిన్నినాయన పండగ సందడిలో హిట్ అయింది. ఈ సినిమా కథ కొత్తగానే ఉంటుంది. కమర్షియల్ యాంగిల్స్ కూడా జోడించడం వల్ల ఇది హిట్ అయింది. ఇక రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పర్లేదు అనిపించింది. నేల టికెట్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బంగార్రాజు కూడా పెద్దగా హిట్ కాలేదు. ఇవన్నీ పెద్దగా కథ లేకుండా కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్‌తో వచ్చినవే.

అయితే కళ్యాణ్ కృష్ణ చిరంజీవి సినిమాని కూడా కమర్షియల్ ఫార్మాట్లోనే తీయనున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు అతను డిఫరెంట్ కథలతో సినిమాలు చేయలేకపోయాడు. ఇప్పుడు అతనికి ఆ సామర్థ్యం ఉందా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొత్త కథ ఆఫర్ చేయకుండా కేవలం కామెడీ, సాంగ్స్, యాక్షన్ వంటి వాటిపై మాత్రమే ఆధారపడితే చిరు నెక్స్ట్ సినిమా ఎదురు తన్నే ప్రమాదం ఉంది. ఇప్పటికే వరుసగా రెండు సినిమాలతో ఈ దర్శకుడు నిరాశపరిచాడు. అందుకే మెగా ఫ్యాన్స్ కళ్యాణ్ కృష్ణ కూడా ఫ్లాప్ ఇచ్చే దర్శకుడేనని కామెంట్ చేస్తున్నారు. కమర్షియల్ ఫార్మాట్లో కాకుండా రజినీకాంత్, కమల్‌ హాసన్ లాగా తగిన కథలను ఎంచుకోవాలని చిరంజీవికి విజ్ఞప్తి చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news