Moviesభ‌యం అంటే తెలియ‌నోళ్ల‌కు భ‌యం చూపిస్తాడు… ఎన్టీఆర్‌పై శ్రీరెడ్డికి ఏంటి ఈ...

భ‌యం అంటే తెలియ‌నోళ్ల‌కు భ‌యం చూపిస్తాడు… ఎన్టీఆర్‌పై శ్రీరెడ్డికి ఏంటి ఈ ప్రేమ‌…!

హాట్ బ్యూటీ శ్రీరెడ్డి చేసే కామెంట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో మామూలుగా వైర‌ల్ అవ్వ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే తాజాగా శ్రీ రెడ్డి టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి పెట్టిన కామెంట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పిచ్చ పిచ్చ‌గా వైర‌ల్ అవుతోంది. ఇంకో 250 రోజుల్లో బాక్సాఫీస్‌ను భ‌య‌పెట్ట‌డానికి వ‌స్తున్నారు.. భ‌యం అంటే తెలియ‌ని మృగాల‌ను భ‌య పెట్ట‌డానికి వ‌స్తున్నాడు జై ఎన్టీఆర్ అంటూ ఆమె పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించేసింది

దీనికి స్పందిస్తోన్న నంద‌మూరి ఫ్యాన్స్ ఆ టైం కోస‌మే తాము వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న దేవ‌ర సినిమా మ‌రో 250 రోజుల్లో థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. ఈ క్ర‌మంలోనే 250 రోజుల్లో ఎన్టీఆర్ బాక్సాఫీస్‌ను భ‌య‌పెట్ట‌డానికి వ‌స్తున్నాడు… భ‌యం అంటే తెలియ‌ని మృగాల‌కు భ‌యం చూపిస్తాడంటూ ఎన్టీఆర్‌పై త‌న అపార‌ప్రేమ చూపించింది.

అలాగే జై ఎన్టీఆర్ అంటూ నినందించింది కూడా..! ఇక ఎన్టీఆర్‌పై ఇటీవ‌ల శ్రీ రెడ్డి త‌ర‌చూ పాజిటివ్‌గా కామెంట్లు చేస్తోంది. ఇక ఎప్ప‌టిక‌ప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను టార్గెట్ చేసే శ్రీరెడ్డి.. ఇప్పుడు ప‌వ‌న్ బ్రో సినిమా థియేట‌ర్ల‌లో ఉన్న వేళ ఎప్పుడో వ‌చ్చే యేడాది వ‌చ్చే జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాపై పాజిటివ్‌గా కామెంట్ చేయ‌డం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news