Moviesఅందరి ముందే ఎన్టీఆర్ ని లాగి పెట్టి కుర్చితో కొట్టిన ఆయన...

అందరి ముందే ఎన్టీఆర్ ని లాగి పెట్టి కుర్చితో కొట్టిన ఆయన ఫ్రెండ్.. ఏమైందంటే..?

సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఎలాంటి రోల్స్ నైనా.. ఎలాంటి పాత్రనైనా.. ఎలాంటి స్టిల్స్ నైనా చేయగలగాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఓ నటుడిగా సెటిల్ అవ్వగలరు . అంతే కాదు నటుడికి ఉండాల్సిన ప్రధాన క్వాలిటీ కూడా అదే . మనకు ఓ పాత్ర ఇచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళు ఎంతటి స్థాయి ఉన్నవాళ్లు అని ఆలోచించకూడదు. ఆ పాత్రకు తగ్గ న్యాయం చేయాలి . అయితే చాలా మంది సీనియర్ ఎన్టీఆర్ తో నటించేటప్పుడు చాలా భయం గా ఉండేవారట . అంత పెద్ద హీరోతో ఇలా నటించమంటున్నారు ఏంటి అంటూ డైరెక్టర్స్ ను తిట్టుకునే వారట . ఆలిస్ట్ లోకి వస్తాడు పేకాటి శివరాం .

కాగా పేకాట శివరాం ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి . అయితే వాళ్ళ కాంబోలో వచ్చిన అందరికీ నచ్చిన సినిమా “పాండురంగ మహత్యం”. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పుండరీక పాత్రలో ఒదిగిపోయినటించారు. ఈ పాత్ర ఎవరు చేసినా సరే ఇంత బాగా చేయలేరు అని అప్పట్లో జనాలు చెప్పుకునేవారు . అయితే ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఓ సీన్లో పేకాట శివరాం కుర్చీతో ఎన్టీఆర్ ని కొట్టే సీన్ ఉంటుంది. అయితే ఆ సీన్ షూటింగ్ టైంలో పేకాట శివరాం.. నేను ఎన్టీఆర్ ని కొట్టనంటే కొట్టను.. వాళ్ళ ఫ్యాన్స్ బాధపడతారు ..ఆయన ను ఎలా కొట్టమంటావు …నేను కొట్టను అంటూ డైరెక్టర్ తో గొడవకు దిగ్గారట. అయితే ఆ టైంలో ఎన్టీఆర్ స్వయంగా వెళ్లి ఓ పాత్ర మనకి ఇచ్చినప్పుడు ఆ పాత్రకి న్యాయం చేయగలగాలి అప్పుడే నిజమైన నటుడిగా ఎదగ గలము అంటూ నచ్చజెప్పి మరీ ఆ సీన్ కోసం ఒప్పించారట.

ఈ క్రమంలోని షాట్ రెడీ అయ్యాక యాక్షన్ చెప్పడంతో ఎన్టీఆర్ ని కుర్చీతో కొట్టారు పేకాట శివరాం. ఆ టైంలో ఆయన వీపుకు చాలా దెబ్బ తగిలి రక్తం కూడా కారింది. అయినా సరే డైరెక్టర్ కట్ చెప్పే వరకు అలా కొడుతూనే ఉన్నాడు. డైరెక్టర్ కట్ చెప్పడంతో పరిగెత్తుకుంటూ ఏడుస్తూ పేకాట శివరాం..ఓ మూలన కూర్చున్నాడు. దీంతో ఎన్టీఆర్ ఆయన వద్దకు వెళ్లి ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు .. సినిమా అన్నాక అంతే పాత్ర డిమాండ్ చేస్తే ఏదైనా చేయ్యాలి .. సీన్ బాగా చేసావ్ శభాష్ అంటూ భుజం తట్టారట . దాంతో అప్పటివరకు ఆయన పడిన భయం మొత్తం ఎగిరిపోయిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news