Moviesచిరంజీవి చేస్తోన్న త‌ప్పులు… కెరీర్‌కు వ‌రుస ఎదురు దెబ్బ‌లు..!

చిరంజీవి చేస్తోన్న త‌ప్పులు… కెరీర్‌కు వ‌రుస ఎదురు దెబ్బ‌లు..!

రీమేక్‌ సినిమాలు చేయటం మీద ఇప్పటికే మెగా బ్రదర్స్ పై సొంత అభిమానుల నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఓటిటి యుగంలో అది కూడా ఆల్రెడీ రిలీజ్ అయ్యి తెలుగులో డబ్ అయిన లూసిఫర్ లాంటి సినిమాలను కూడా రీమేక్ చేయడం అసలు ఎందుకు ? ఆడాయో తెలియని వేదాళం లాంటి సినిమాలను రీమేక్‌ చేయడంతో చిరంజీవిపై విమర్శలు వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఇలా రీమేక్‌ టేస్టులతో వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న చిరంజీవి తన వద్దకు వచ్చిన ఒరిజినల్ కథలు.. మంచి కథలను ఎంపిక చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారని ఆయన సన్నిహితులే చెబుతున్నారు.

దీనిని బట్టి చిరంజీవి వరుసగా ఎంత పెద్ద తప్పులు చేస్తున్నారో తెలుస్తోంది. నిర్మాత అశ్వినీద‌త్‌తో చిరంజీవికి ఉన్న సాహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి అశ్వినీద‌త్‌ చిరంజీవి కోసం ఒక మంచి కథ రాయించి తీసుకువెళ్లారట. ఆ కథ ఏదో కాదు ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్ గా రూపొంది ప్రేక్షకులను ఎంతో మెప్పించిన స్క్రిప్ట్ కావడం విశేషం. రాజ్ డీకే దర్శకత్వంలో మనోజ్ బాజ్‌పేయ్‌ హీరోగా రూపొందిన ఫ్యామిలీ మ్యాన్ ఫస్ట్ పార్ట్ ఇండియాలో వెబ్ సిరీస్ లకే ఆదరణ పెంచింది.

ఆమెజాన్‌లో రిలీజ్ అయిన ఫ్యామిలీ మెన్ ఇప్పటికీ కొన్ని భాగాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఆసక్తి రేపుతూ ఉంటుంది. ఇది ఒక పెద్ద వెబ్ సిరీస్ అయిన ఒక మంచి సినిమాకు ఉండాల్సిన ముడిసరుకు ఇందులో ఉంది. దీనిని మూడు గంటల సినిమాగా కుదిస్తే హీరో ఎవరైనా ? నిజంగా అదిరిపోయేదని చెప్పాలి. అలాంటి స్క్రిప్ట్ చిరంజీవి వద్దకు వెళితే ఆయన స్వయంగా దానిని తిరస్కరించారు.

తన పాత్రకు పిల్లలు ఉండ‌డంతో చిరంజీవికి అలాంటి ఎలిమెంట్స్ నచ్చలేదట. ఆఖరికి ఆ పిల్లల పాత్రలను తీసేద్దామని చెప్పినా కూడా చిరంజీవి వినలేదట. ఏది ఏమైనా రీమేక్‌ సినిమాల మీద మోజు పడ్డ చిరంజీవి ఇలాంటి కథాబలం ఉన్న సినిమాలను వదులుకోవటం నిజంగా ఆయన చేస్తున్న తప్పులు అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news