Moviesచిరంజీవికే ప్ర‌పోజ్ చేసిన శ్రీముఖి… సిగ్గుతో మెగాస్టార్ ఏం చేశాడంటే…!

చిరంజీవికే ప్ర‌పోజ్ చేసిన శ్రీముఖి… సిగ్గుతో మెగాస్టార్ ఏం చేశాడంటే…!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తరుకెక్కిన సినిమా భోళాశంకర్. ఈ సినిమా ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిచెరుకు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్న నటించగా.. చిరుకు చెల్లిగా మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. అలాగే ఈ సినిమాలో బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి కూడా ఒక కీలకపాత్రలో కనిపించబోతుంది

భోళా శంకర్ సినిమాలో శ్రీముఖిది కీలకమైన పాత్ర అని.. ఆమెది కాస్త బోల్డ్ రోల్ అని తెలుస్తోంది. గత రాత్రి జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీముఖి తెగ సందడి చేసింది. ట్రైలర్లో కూడా శ్రీముఖి ఆకట్టుకుంది. చిరంజీవితో ఆమెకి ఈ సినిమాలో మంచి కాంబినేషన్లు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఈవెంట్లో శ్రీముఖి మెగాస్టార్‌కు స్టేజ్ మీదనే భోళాజీ ఐలవ్యూ అంటూ ప్రపోజ్ చేసింది. శ్రీముఖి నేరుగా స్టేజ్ మీద ఆ మాట అనడంతో చిరంజీవి సిగ్గు పడిపోయారు.. మెలికలు తిరిగిపోయారు.

చిరుతో నటించే అవకాశం రావడం తన అదృష్టం అని.. తనను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్ కి శ్రీముఖి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కీర్తి సురేష్ తో పనిచేయడం కూడా నాకు సంతోషంగానే ఇచ్చిందని శ్రీముఖి తెలిపింది. అందరికీ 4g, 5g మాత్రమే తెలుసు.. కానీ నాకు తెలిసిన జి భోళాజీ అంటూ శ్రీముఖి హంగామా చేసింది. ఏది ఏమైనా శ్రీముఖి ఇచ్చిన స్పీచ్ ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బాగా హైలైట్ అయింది. అలాగే ఆమె బ్లాక్ చుడీదార్ వేసుకువచ్చి తన అందాలతో మెరిసిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news