Newsతన కెరీర్ లో మహేశ్ బాబు డైరెక్ట్ చేసిన వన్ అండ్...

తన కెరీర్ లో మహేశ్ బాబు డైరెక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ సినిమా ఇదే..ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు .. ప్రెసెంట్ స్టార్ హీరో స్థానాన్ని అందుకొని టాప్ హీరోగా రాజ్యమేలేస్తున్నాడు . కాగా ప్రజెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాను చేస్తున్న మహేష్ బాబు.. ఆ తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరో అడ్వెంచర్స్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు . కాగా ఇలాంటి క్రమంలోని మహేష్ బాబుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు.

ఇప్పటివరకు హీరోగాని నటించారని అందరూ అనుకున్నారు . కానీ మహేష్ బాబు డైరెక్షన్ కూడా చేశారు . అది కూడా తాను నటించిన సినిమాకి .. ఆయన డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ఆఖరి సినిమా ఇదే కావడం గమనార్హం . ఆ సినిమా ఏదో కాదు పోకిరి . అదేంటి పోకిరి సినిమాకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కదా అనుకుంటున్నారా ..ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నాను . ఎస్ మీ మాట నిజమే ..పూరి జగన్నాధ్ ఈ సినిమాకి డైరెక్టర్.. అయితే పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ ను ముందుగా రవితేజకు వివరించారు .

రవితేజ కొన్ని కారణాల చేత ఈ ప్రాజెక్టును రిజెక్ట్ చేశారట . ఈ క్రమంలోనే ఈ కథ మహేష్ బాబు వద్దకు వెళ్లగా స్క్రిప్ట్ అంతా నచ్చింది.. కానీ అక్కడక్కడ కొన్ని చేంజెస్ చేస్తాను అంటూ చెప్పారట. దీనికి పూరి జగన్నాధ్ సైతం యాక్సెప్ట్ చేశారట . అంతేకాదు సినిమా షూట్ అప్పుడు కొన్ని షూట్స్ ని మహేష్ బాబు ఓన్ గా డైరెక్ట్ చేసుకున్నారట . మరీ ముఖ్యంగా షెడ్ ఫైట్ సీన్ మొత్తం మహేష్ బాబునే డైరెక్ట్ చేశారట. అంతేకాదు ఇంటర్వెల్ కి వచ్చే ముందు ఫోర్ట్ సీన్ కూడా మహేష్ బాబు దర్శకత్వంలోనే తెరకెక్కిందట. అలా ఈ సినిమాకి డైరెక్టర్ గా మారిపోయాడు మహేష్ బాబు . అంతే కాదు మహేష్ కెరియర్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా ఇదే అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news