Newsఅప్పుడు నీహారిక..ఇప్పుడు కలర్స్ స్వాతి.. విడాకుల విషయంలో అదే తప్పు..!!

అప్పుడు నీహారిక..ఇప్పుడు కలర్స్ స్వాతి.. విడాకుల విషయంలో అదే తప్పు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోయిన్స్ – హీరోలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ .. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే ఇలా విడాకులు తీసుకుంటూ ఉండడం మనం గమనించాల్సిన విషయం. కాగా ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు విడాకులు తీసుకొని సింగిల్గా తమ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోని వన్ ఆఫ్ ద స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న కలర్స్ స్వాతి.. సైతం విడాకులు తీసుకోబోతుంది అన్న ప్రచారం ఊపందుకుంది.

దీనికి తగ్గట్టే అమ్మడు కూడా ఎక్కడ దీనిని నెగిటివ్గా చూపించకపోవడంతో ఇది నిజమే అనుకున్నారు అభిమానులు . అయితే ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలు ఈ వార్త నిజంగా నిజమేనా ..? కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతుందా..? అని నేరుగా ఆమెని అప్రోచ్ అయ్యారు. అయితే వాళ్లకి ఇచ్చిన ఆన్సర్ అభిమానులు నమ్మడం లేదు. కలర్స్ స్వాతి మీడియా లో వచ్చేవి ఫేక్ అంటూ చెప్పిందే కానీ.. విడాకులు తీసుకోవట్లేదు అని ఎక్కడ గట్టిగా నొక్కి పెట్టి చెప్పలేదు .

మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధం అలాంటిది.. ఏదైనా ఉంటే నేనే చెప్తాను అంటూ కొట్టి పడేసిందే కానీ ఎక్కడ కూడా మేం విడాకులు తీసుకోవడం లేదు .. మీడియాలో వచ్చేది అంతా ఫేక్ అంటూ గట్టిగా నమ్మకంగా చెప్పలేదు . అయితే అంతకుముందు విడాకులు తీసుకున్న నిహారిక సైతం భర్తతో విడాకులు తీసుకునే ముందు ఇలాంటి కామెంట్స్ చేసింది . సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అబద్ధమని చెప్పిందే కానీ ఎక్కడ చైతన్యతో విడాకులు తీసుకోవడం లేదు అంటూ ప్రకటించలేదు. అదే విధంగా కలర్స్ స్వాతి కూడా చేస్తూ ఉండడంతో త్వరలోనే ఈ బేబీ బిగ్ బాంబ్ పేల్చబోతుంది అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి కలర్స్ స్వాతి ఇప్పటికైనా మేల్కొని తన విడాకుల విషయంలో క్లారిటీ ఇస్తుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news