Movies"ఏ గొట్టం నా***కి".. ఫస్ట్ టైం బూతులతో రెచ్చిపోయిన తమన్..!!

“ఏ గొట్టం నా***కి”.. ఫస్ట్ టైం బూతులతో రెచ్చిపోయిన తమన్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రిటీస్ ని ఏ రేంజ్ లో టార్గెట్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారో మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎవరైనా స్టార్ సెలబ్రిటీ పాపులారిటీ దక్కించుకుంటూ ఉన్న సోషల్ మీడియాలో క్రేజ్ అందుకుంటూ ఉన్న వాళ్ళపై హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ చేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు . ఈ మధ్యకాలంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని ఏ రేంజ్ లో ఆడేసుకున్నారో మనకు బాగా తెలిసిందే.

అయితే ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా మ్యూజిక్ అందించిన పవన్ కళ్యాణ్ – తేజు బ్రో చిత్రం నుంచి మై డియర్ మార్కండేయ అనే సాంగ్ రిలీజ్ అయింది . ఈ సినిమా అనుకున్నంత స్థాయి రీచ్ కాలేకపోయింది . ఈ క్రమంలోనే జూలై 28న చిత్రం విడుదల కానుండడంతో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నాడు . కాగా ఓ మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న రెచ్చిపోయి హాట్ కామెంట్స్ చేశారు . ప్రెస్ మీట్ లో తమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి .

ఆయన మాట్లాడుతూ..” ఎవ్వరూ ఏ డైరెక్టర్ సినిమా ఫ్లాప్ అవ్వాలని అనుకోరు. ఆ కథకి ఎలాంటి పాట కావాలో అలాంటివే పాడుతూ వస్తూ ఉంటాం . హిట్ – ఫ్లాప్ అనేది మా చేతుల్లో ఏవి ఉండవు “అంటూ చెప్పుకు వచ్చారు. అంతేకాదు సోషల్ మీడియాలో తనపై ట్రోలింగ్ జరుగుతున్న దాని గురించి రెస్పాండ్ అవుతూ తమన్ హాట్ కామెంట్స్ చేశాడు . క్రికెట్ మీద ఉన్న శ్రద్ధ మనకి మ్యూజిక్ పైన లేదు అంటూ చాలా ట్రోల్ చేసే వారికి తమన్ ఘాటుగానే బదులిచ్చారు .

ఆయన మాట్లాడుతూ ..”నాకు మందు అలవాటు లేదు . గర్ల్ ఫ్రెండ్స్ లాంటి పిచ్చి వ్యసనాలు లేవు.. నాకున్న ఒకే ఒక్క వినోదం క్రికెట్ . రాత్రి 9 గంటలకు వెళ్లి క్రికెట్ ఆడుతా.. కానీ నాకు పని ఉంటే ఆ పనిని వదిలేసి మాత్రం నేను ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. అలా చేసి ఉంటే ఒక డైరెక్టర్ ఒక నిర్మాత కూడా నాపై ఇప్పటివరకు కంప్లైంట్ ఇవ్వలేదు . నా పనిపై నేను ఎంతో శ్రద్ధగా ఉంటాను . కాబట్టి నేను ఏ గొట్టం నా కొడుకుకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ” అంటూ ఘాటుగా ఫైర్ అయిపోయారు. దీంతో తమన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news