Movies'జవాన్' ట్రైలర్ వచ్చేసిందోచ్.. యాక్షన్ ఎలివేషన్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్న...

‘జవాన్’ ట్రైలర్ వచ్చేసిందోచ్.. యాక్షన్ ఎలివేషన్ తో గూస్ బంప్స్ తెప్పిస్తున్న షారుఖ్ ఖాన్..కుమ్మి కుమ్మి పడేసాడు పో.. (వీడియో)..!!

బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా జవాన్ . రీసెంట్ గానే పఠాన్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న షారుఖ్ ఖాన్ ..బ్యాక్ టు బ్యాక్ మరో హిట్ అందుకోవడానికి సిద్ధమైపోయాడు . సినిమాపై అభిమానులు ఎంతటి అంచనాలు పెట్టుకొని ఉన్నారో మనకు తెలిసిందే. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది . సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమాగా చరిత్రను తిరగరాసేస్తుంది అంటూ షారుక్ ఖాన్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు .

ఇక జవాన్ ట్రైలర్ విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో సస్పెన్స్ .. ఎంతో ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేశాడు డైరెక్టర్ అట్లీ. ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు నయనతార – దీపికా పదుకొనే . సినిమాకి గ్లామర్ డోస్ కూడా బాగానే తట్టించాడు అట్లీ అంటూ టీజర్ ఆధారంగా తెలిసిపోతుంది. సెప్టెంబరు 7న గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీక్ అయ్యి పాజిటివ్ కామెంట్స్ తో ముందుకు వెళ్తుంది . కాగా ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ కెరియర్ లో పఠాన్ సినిమాలోని హైయెస్ట్ యాక్షన్ సీన్స్ ఉన్నాయి అనుకుంటే దానికి మించిన ఎలివేషన్స్ తో డైరెక్టర్ అట్లీ జవాన్ సినిమాను ఎంతో ఇంట్రెస్టింగ్ గా యాక్షన్ సీన్స్ తెరకెక్కించినట్లు తెలుస్తుంది .

“నేను ఎవరిని ..నేను ఎవరిని కాదు..నాకు ఏమీ తెలియదు ..తల్లికిచ్చిన మాట కావచ్చు ..నెరవేరని లక్ష్యం కావచ్చు.. నేను మంచివాడినా..? చెడ్డవాడినా..? లేక పుణ్యాత్ముడినా..? పాపాత్ముడినా..? నీకు నువ్వే తెలుసుకో..? అంటూ చెప్పే డైలాగ్ దానికి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ టీజర్ కి హైలైట్ గా మారింది . దీంతో షారుక్ ఖాన్ పై పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో షారుఖ్ ఖాన్ వివిధ గెటప్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి టీజర్ తోనే బొమ్మ బ్లాక్ బస్టర్ టాక్ దక్కించుకున్నింది. ఇక సినిమా రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సిందే అంటున్నారు షారుక్ ఖాన్ అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news