Moviesబాలయ్య సీన్ ని కాపీ కొట్టిన షారుక్.. "జవాన్" ట్రైలర్ తో...

బాలయ్య సీన్ ని కాపీ కొట్టిన షారుక్.. “జవాన్” ట్రైలర్ తో అడ్డంగా దొరికిపోయాడుగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ బాద్ షా గా పాపులారిటీ సంపాదించుకున్న షారుఖ్ ఖాన్ టాలీవుడ్ నందమూరి నటసింహం బాలయ్యను కాపీ కొట్టారా అంటే అవునని అంటున్నారు అభిమానులు. దానికి ప్రూఫ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . మనకు తెలిసిందే బాలయ్య ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నాడు.

రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సైతం రిలీజ్ అయింది . టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశాడు అనిల్ రావిపూడి. అంతేకాదు టీజర్ లాస్ట్ లో ట్రైన్లో ఓ సాంగ్ పాడుతూ బాలయ్య విజిల్ వేసిన క్లిప్స్ కూడా మనం చూడొచ్చు . అయితే సేమ్ టు సేమ్ డిట్టో షారుక్ ఖాన్ రీసెంట్ గా నటించిన జవాన్ సినిమా ట్రైలర్ లోను అదే ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

ప్రెసెంట్ ఇదే క్లిప్స్ ని ట్రెండ్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు . కింగ్ ఖాన్ కూడా బాలయ్య సినిమాని కాపీ కొట్టారు అంటూ ట్రెండ్ చేస్తున్నారు. కాగా జవాన్ ప్రీ టీజర్ వీడియో చివర్లో షారుక్ ఖాన్ ఏఎన్ఆర్ డాక్టర్ చక్రవర్తి సినిమాలోని ఈ మౌనం ఈ బిడియం సాంగ్ ప్లే అవుతూ ఉండగా స్టెప్స్ వేస్తాడు . భగవంత్ కేసరి సినిమా టీజర్ లోను చివర్లో విజిల్ వేస్తూ బాలయ్య స్మైల్ ఇవ్వడం తర్వాత ఫుల్ జోష్తో గిటార్ ప్లే చేస్తూ ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహం ఇస్తారు. అయితే ఇదే వీడియోస్ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అనిల్ ఐడియాను అట్లీ కూడా కాపీ కొట్టేసాడు అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news