Moviesసమంత ఖాతాలో మరో తెలుగు హీరో బలి.. నొప్పి లేకుండా కస...

సమంత ఖాతాలో మరో తెలుగు హీరో బలి.. నొప్పి లేకుండా కస కస కోసేసిందిగా..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. హీరో విజయ్ దేవరకొండ ని చీట్ చేసిందా..? అంటే అవునని అంటున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్. సమంత కోసం విజయ్ దేవరకొండ ఎంత రిస్క్ చేశారో అందరికీ తెలిసిన విషయమే . అసలు ఆమెతో సినిమాలో నటించడానికి ఏ హీరో ముందుకు రాని పక్షంలో విజయ్ దేవరకొండ – సమంతపై ఉన్న రెస్పెక్ట్ తో “ఖుషి” సినిమాను చేయడానికి ఒప్పుకున్నారు . అంతేకాదు “ఖుషి” సినిమా స్టార్టింగ్ టైం లో కూడా ఆమె మయోసైటీస్ వ్యాధి కారణంగా ఆరు నెలలు బ్రేక్ ఇచ్చిన సరే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోకుండా.. ఆమె కోసమే కాల్ షీట్స్ వేస్ట్ చేసుకుని మరి టైం స్పెండ్ చేశారు .

ఆ తర్వాత చకచకా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఖుషి సినిమా త్వరలోనే రిలీజ్ కు సిద్ధం కాబోతుంది . అయితే సమంత సినిమా షూట్ అయిపోగానే సంచలన ప్రకటన చేసింది .ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరం కాబోతున్నట్లు చెప్పుకొచ్చింది . మయోసైటీస్ వ్యాధి కారణంగా అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి సమంత ఫిక్స్ అయిందట . ఈ క్రమంలోనే సమంత అమెరికాకి వెళ్ళిపోతుంది .

అయితే ఖుషి సినిమా షూటింగ్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేను అంటూ మేకర్స్ కు చెప్పేసిందిట. దీంతో ఇప్పుడు ఖుషి సినిమా ప్రమోషన్స్ పూర్తి బాధ్యత విజయ్ దేవరకొండ పైన పడింది . సినిమాలో కీ రోల్ అయిన సమంత లేకుండా విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ ని ఎంతవరకు నెట్టుకొస్తాడో అర్థం కావడం లేదు . అంతే కాదు విజయ్ దేవరకొండ లాస్ట్ నటించిన “లైగర్” సినిమా చాలా ఫ్లాప్ అయింది .

ఇప్పుడు ఈ సినిమా హిట్ అవ్వడం విజయ్ దేవరకొండకు చాలా ఇంపార్టెంట్ . ఈ సినిమా పై బోలెడంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడట విజయ్. అంతేకాదు అటు ఆరోగ్యపరంగా ఆమె కండిషన్ బాగాలేని కారణంగా ఆమెను ఏమీ అనలేరు ..ఇలా ఒక్కడే ప్రమోషన్స్ చేయలేరు. దీంతో సమంత నొప్పి లేకుండా విజయ్ హెడ్ ని కోసేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. ఏం చేస్తాడో విజయ్..వేచి చూడాలి. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news