NewsSSMB 29 కంటే ముందే మహేశ్-రాజమౌళి కాంబోలో వచ్చిన సినిమా ఏంటో...

SSMB 29 కంటే ముందే మహేశ్-రాజమౌళి కాంబోలో వచ్చిన సినిమా ఏంటో మీకు తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమాలలో ఒకటి మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా . ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ ప్రకటన రాలేదు . ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా రిలీజ్ చేయలేదు . కానీ ఈ సినిమాకి సంబంధించిన న్యూస్లు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఇప్పటికీ కథ రెడీ అవ్వగా… ఈ సినిమాకి సంబంధించిన పనులను రాజమౌళి చహ్కచకా కంప్లీట్ చేస్తున్నారు.

Director of RRR SS Rajamouli in West Hollywood, CA. / Bethany Mollenkof for ESPN

త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారట. అంతేకాదు మహేష్ బాబు సైతం రాజమౌళి సినిమాలో చాలా స్టైలిష్ గా ఫిట్గా కనిపించడానికి ఎక్కువ టైం వర్క అవుట్స్ చేస్తున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు రాజమౌళికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఆల్రెడీ ఓ సినిమాలు నటించాడు అన్న న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఆ సినిమా మరి ఏదో కాదు మహేష్ బాబు హీరోగా తెరంగేట్రం చేసిన “రాజకుమారుడు” సినిమా . ఎస్ ఈ సినిమాకి మెయిన్ దర్శకుడు రాఘవేంద్రరావు మనకు తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ స్కిల్స్ నేర్చుకోవడం కోసం రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే రాజకుమారుడు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు రాజమౌళి . ఈ విషయాన్ని స్వయాన రాఘవేంద్రరావు గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో మహేష్ బాబు రాజమౌళి ఎప్పుడో కలిసి నటించారని ..రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా కూడా చేశారని న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news