Moviesలిప్ కిస్ ఇచ్చిన తరువాత .. నోటిని డెటాల్ తో కడుకున్న...

లిప్ కిస్ ఇచ్చిన తరువాత .. నోటిని డెటాల్ తో కడుకున్న స్టార్ బ్యూటీ..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా కొన్నిసార్లు ఇష్టం లేకుండా కొన్ని సన్నివేశాలలో నటించాల్సి వస్తుంది . మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ లిప్ లాక్ సీన్స్ .. బెడ్ సీన్స్ అన్నా ఇష్టపడరు . అయితే కధ అనుసారం సీన్ డిమాండ్ చేయడంతో అలాంటి బోల్డ్ సీన్స్ నటించాల్సి వస్తుంది . అలాగే ఇష్టం లేకుండా లిప్ లాక్ సీన్ లో నటించి.. ఆ తర్వాత డెటాల్తో నోరు వాష్ చేసుకున్న హీరోయిన్ కి సంబంధించిన వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.

బాలీవుడ్ నటిని నీనా గుప్తా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో రాణిస్తూ ఇప్పటికి అరాకొరా పాత్రలో మెప్పిస్తున్న ఈ బ్యూటీ రీసెంట్గా లస్ట్ స్టోరీస్ 2 లో కూడా నటించింది. విజయ్ వర్మ – తమన్నా – మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ అర్ధరాత్రి నుండి స్ట్రీమిం అయింది . ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ప్రమోషన్స్ లో గ్రాండ్ గా పాల్గొన్న టీం వాళ్ళ లైఫ్ లోనే జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటూ వచ్చారు .

ఇలాంటి క్రమంలోనే నీనా గుప్తా కూడా తన ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ గురించి ఆమె చెప్పిన విషయాన్ని అందరూ షాక్ అయిపోయారు. ముద్దు సీన్ లో నటించిన తర్వాత ఆమె నోటిని డెటాల్తో నాలుగు సార్లు శుభ్రం చేసుకుందట. లిప్ కిస్ అనుభవం ఎవరితో అయ్యిందో కూడా వెల్లడించింది . “కొన్నేళ్ల క్రితం నటుడు దిలీప్ తో కలిసి ఓ సీరియల్ లో నటించాను . అయితే మా ఇద్దరి మధ్య ఓ లిప్ కిస్ సీన్ ఉంటుంది . ఇండియన్ టీవీ చరిత్రలో అదే మొదటి లిప్ కిస్ కావచ్చు . ఆరోజు రాత్రి అంత నిద్రపోలేకపోయాను “అంటూ నీనా గుప్తా చెప్పుకొచ్చింది . అంతేకాదు ఆ సీన్ తర్వాత నాలుగు సార్లు డెటాల్ తో కడుక్కుందట . ఇదే విషయాన్ని చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది నీనా గుప్తా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news