Moviesఅకీరా విష‌యంలో రేణూదేశాయ్ చేసిన ప‌నికి ఫుల్ ఖుషీ అవుతోన్న ప‌వ‌న్...

అకీరా విష‌యంలో రేణూదేశాయ్ చేసిన ప‌నికి ఫుల్ ఖుషీ అవుతోన్న ప‌వ‌న్ ఫ్యాన్స్‌…!

ఏ కొడుకు ఎదుగుతున్నా తల్లి సంతోష పడుతుంది. అకీరా నందన్ విషయంలో రేణూ దేశాయ్ కూడా చాలా సంతోష పడుతోంది. ప్రస్తుతం అకీరా నందన్ టీనేజీలో ఉన్నాడు. తనకిష్టమైన మ్యూజిక్‌లో ప్రావీణ్యం సంపాదించాడు. అంతేకాకుండా ఓ షార్ట్ ఫిల్మ్‌కి అప్పుడే మ్యూజిక్ డైరెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఏదేమైనా ఆయన తండ్రి పవన్ కళ్యాణ్ తెలుగులో టాప్ హీరో. ఆయన కొడుకుగా అకీరా హీరో అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అయితే అకీరాను పవన్ కొడుకు అని అంటే రేణూ దేశాయ్‌కి అస్సలు నచ్చదు. ఈ విషయంలో అభిమానులతో ఆమె సోషల్ మీడియా వేదికగా పలుమార్లు గొడవ పడింది. అకీరా తన కొడుకు అని, తన కష్టార్జితంతో పెంచి పెద్ద చేస్తున్నానని అందరికీ ఆమె బదులిచ్చింది. తాజాగా ఆమె తన కొడుకు అకీరాకు సంబంధించిన ఓ ఆసక్తికర వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

అకీరా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఆరున్నర అడుగుల ఎత్తుతో టీనేజీలో ఉన్నాడు. ఈ సమయంలో జిమ్‌లో అతడు వర్కవుట్స్ చేస్తున్న వీడియోను రేణూదేశాయ్ తాజాగా పోస్ట్ చేసింది. అకీరా తెలుగు, హిందీ సాంగ్స్ వింటూ వర్కౌట్స్ చేస్తున్నావడని, ఇందుకు చాలా గర్వపడుతున్నానని ఆమె పేర్కొంది. అర్ధంపర్ధం లేని ఇంగ్లీషు పాటలు కాకుండా మన సొంత భాషల పాటలు వినడం గొప్ప విషయం అని క్యాప్షన్ ఇచ్చింది.

దీనికి పవన్ అభిమానులు, నెటిజన్ల నుంచి సానుకూల కామెంట్స్ వస్తున్నాయి. అకీరా అన్నింటిలో ప్రావీణ్యం సంపాదించి తెలుగులో మంచి హీరో అవ్వాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే తాను చదువుతో పాటు వివిధ రకాల కళలలో అకీరాను, ఆద్యను ప్రోత్సహిస్తున్నట్లు రేణూ దేశాయ్ తెలిపింది. పెద్దయ్యాక వారికిష్టమైన ప్రొఫెషన్‌లో వారు రాణించేలా ప్రోత్సహిస్తానని ఆమె వెల్లడించింది. పవన్ అభిమానులు మాత్రం అకీరాను సినిమాల్లో హీరోగా రావాలని కోరుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news