Moviesజాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన జబర్ధస్త్ యాంకర్ సౌమ్య.. ఇక అమ్మడి...

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన జబర్ధస్త్ యాంకర్ సౌమ్య.. ఇక అమ్మడి లైఫ్ చేంజ్..!!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న సౌమ్యరావు జాతకం తిరిగిపోయిందా..? అవుననే చెప్పాలి . నిన్న మొన్నటి వరకు బుల్లితెరపై మెరిసిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే వెండి తెర పై మెరవబోతుందట. అది కూడా ఓ లేడీ ఓరియంటెడ్ ఫిలిం తో . ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కన్నడ ఇండస్ట్రీలో డెబ్యూ డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సౌమ్యరావు హీరోయిన్గా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ కాబోతుంది అంటూ తెలుస్తుంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకున్న సౌమ్యరావు త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన ఇవ్వనున్నట్లు ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. కాగా ఇది కన్నడ ఇండస్ట్రీలోనే తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతుంది . సీరియల్లో పలు పాత్రలు వేసిన నువ్వు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మెరవబోతున్నావు అంటే అది అంతా జబర్ధస్త్ పుణ్యమే అంటూ ఓ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

ఈ భామ ఈటీవీలో వచ్చే శ్రీ‌మంతుడు సీరియ‌ల్ తో పాపుల‌ర్ అయ్యింది.. ఇక తాజాగా కామెడీ షో జబర్దస్త్‌లో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ కొత్త యాంకర్ రెమ్యూనరేషన్ ఎంత అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుస్తోన్న సమాచారం ప్రకారం సౌమ్య రావు‌కు రెమ్యూనరేషన్ ఎపిసోడ్ కి 80 వేలు ఇస్తున్నారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news