Moviesబాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేతి పెట్టుకునే బ్రాస్లెట్ అంత స్పెషలా..?...

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేతి పెట్టుకునే బ్రాస్లెట్ అంత స్పెషలా..? దీని వెనక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే..!!

బాలీవుడ్ ఇండస్ట్రీలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా మకుటం లేని మహారాజు గా ఏలేస్తూ.. ఇప్పటికీ నెంబర్ వన్ హీరోగా ఇండస్ట్రీలో నిలుస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది. మనకు తెలిసిందే సల్మాన్ ఖాన్ కి కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంది. కానీ ఎప్పుడు కూడా ఆయన బయటకు వచ్చేటప్పుడు ఒకే ఒక బ్రెస్లెట్ కంటిన్యూగా ధరిస్తూ వస్తూ ఉంటాడు.

ఇప్పటివరకు చాలా ప్రోగ్రామ్‌స్.. సినిమాలలో.. ఈవెంట్స్ లో ఈ బ్రెస్లెట్ ని మీరు చూసి ఉంటారు. అయితే ఎందుకు అన్ని వేల కోట్ల ఆస్తులున్న సల్మాన్ ఖాన్ ఒకే బ్రేస్లెట్ ను ధరిస్తూ ఉంటారు అని ఎప్పుడైనా మీకు అనుమానం వచ్చిందా..? వచ్చే ఉంటుంది.. కానీ , అది అడిగే ఛాన్స్ లేక మీరు సైలెంట్ గా అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ చదివి తెలుసుకోండి.

బాలీవుడ్ కండల వీరుడు గా పేరు సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ చేతికి ఉండే ఈ బ్రేస్లెట్ చాలా అరుదైనది ..ఖరీదైనది . ఇది చిన్నప్పుడు తనకు వాళ్ళ నాన్నగారు ఎంతో ఇష్టంగా ఇచ్చారట. అయితే తనకి చిన్న వయసులో దీని వాల్యూ తెలియక బాగా ఆడుకునే వారట . దీని వాల్యూ తెలిశాక సల్మాన్ ఖాన్ దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తూ వచ్చాడట . తను కెరియర్ లోకి వచ్చాక బ్రేస్లెట్ తన తండ్రి ఇచ్చారని .. అందులో ఉండే ప్రత్యేకమైన మణి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు . అది ఏదైనా నెగెటివిటీని మన మీదికి వస్తే ఆ రాయి తీసుకుంటుందని.. అది వెంటనే బ్రేక్ అయిపోతుందని .. అలా ఇప్పటివరకు తాను ఏడుసార్లు ఈ స్టోన్స్ మార్చానని సల్మాన్ ఖాన్ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు . ప్రెసెంట్ ఇదే విషయం వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news