Moviesగుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయితే ఎవ్వరికి బొక్కా..? మహేశ్ కా..?...

గుంటూరు కారం సినిమా ఫ్లాప్ అయితే ఎవ్వరికి బొక్కా..? మహేశ్ కా..? త్రివిక్రమ్ కా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ అయిందో కానీ అప్పటి నుంచి ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.

కాగా స్టార్టింగ్ లోనే ఈ సినిమాకు బ్రేకులు పడిపోయాయి . ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయగానే సినిమా షూటింగ్స్ బంద్ అంటూ కొన్నాళ్లపాటు సినిమా ఆగిపోయింది . ఆ తర్వాత మహేష్ బాబు నాన్నగారు అమ్మగారు వరుసగా చనిపోవడంతో కొన్నాళ్ళపాటు సినిమాకి బ్రేక్ వేసిన మహేష్ ఆ తర్వాత మళ్లీ స్టార్ట్ చేశారు . అయితే మళ్లీ సమ్మర్ వెకేషన్ అంటూ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడానికి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోయాడు . ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తన పర్సనల్ పనులు బిజీ అయిపోయారు .

ఇలా ఒకరు బిజీగా ఉంటే మరొకరు సినిమా షెడ్యూల్ ని లేట్ చేస్తూనే వచ్చారు. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా లేట్ అవ్వడానికి కారణం త్రివిక్రమ్ – మహేష్ బాబు మధ్య సఖ్యత లేకపోవడం ఒక కారణం అంటూ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు మొదటి నుంచి మహేష్ బాబుకి ఈ స్క్రిప్ట్ పెద్దగా నచ్చలేదని.. చేంజెస్ చేయమంటూ చెబుతూ వచ్చారని ..అయినా త్రివిక్రమ్ మాట వినకుండా అవే సీన్స్ రాస్తూ వస్తూ ఉండడంతో కోపంతో మహేష్ ఈ సినిమాను లేట్ చేస్తున్నాడు అన్న వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి.

ఇలాంటి క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా అదే విధంగా మ్యూజిక్ ఇవ్వడంతో పాటు పూజ హెగ్డే బోలెడు కండిషన్స్ పెట్టడంతో ఇద్దరిని సినిమా నుంచి తీసేయమంటూ చెప్పుకొచ్చారట . అయితే త్రివిక్రమ్ అందుకు నో చెప్పడంతో మహేష్ ఈ సినిమా షూట్ ను మరికొన్నాళ్లపాటు వాయిదా వేయబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది . అయితే వీటికి చెక్ పడుతూ రీసెంట్ గానే గుంటూరు కారం టీం స్పందించింది . “తమన్ ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడని.. త్వరలోనే ఈ సినిమా షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని జనవరి 13న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది “అంటూ క్లారిటీ ఇచ్చారు .

అయితే సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమా లేట్ అవ్వడం వల్ల ఎవరికి నష్టం త్రివిక్రమ్ కా..? మహేష్ బాబు కా..? అన్న చర్చలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . గుంటూరు కారం సినిమా లేట్ అయితే ఎవరికి బొక్క మహేష్ బాబు కా..? త్రివిక్రమ్ కా..? మీరు ఎవరు అనుకుంటున్నారు.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news