Moviesఆహాలో అర్జున్ లీలా సందడి ఏంటో తెలిసిపోయిందోచ్..త్రివిక్రమ్ ప్లాన్ కేకో కేక..!!

ఆహాలో అర్జున్ లీలా సందడి ఏంటో తెలిసిపోయిందోచ్..త్రివిక్రమ్ ప్లాన్ కేకో కేక..!!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ .. హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న శ్రీ లీల .. కలిసి ఆహాలో ప్రోగ్రాం చేయబోతున్నారు అంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే . తమదైన స్టైల్ లో ఇద్దరు టాప్ పొజిషన్లో దూసుకుపోతున్నారు . ఇలాంటి క్రమంలోనే తెలుగు ఓటీటీ ఆహా వీళ్ళిద్దరిని పెట్టి ఓ సరికొత్త గేమ్ చేయబోతుంది అంటూ ప్రచారం జరిగింది.

దీనికి తగ్గట్టే ఆహా కూడా వాళ్ళిద్దరూ పోస్టర్స్ కి సంబంధించి ఒక క్రేజీ లుక్ ను విడుదల చేసింది. ఈ లుక్ లో శ్రీలీల ఏకంగా బన్నీ సంకనెక్కి కూర్చోవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అయితే అసలు వీళ్ళిద్దరూ కలిసి చేస్తుంది మూవీ నా..? వెబ్ సిరీసా..? లేక ప్రమోషన్సా..? అని అంత బుర్ర పీక్కున్నారు జనాలు. ఫైనల్లీ ఆ సీక్రెట్ రివీల్ చేసేసారు ఆహా మేకర్స్ . తాజాగా నేడు ఆ ఒరిజినల్ కంటెంట్ ఏంటో చెప్పేస్తూ వీడియోని రిలీజ్ చేసింది ఆహా.

ఈ వీడియోని చాలా ఎంటర్టైనింగ్గా తెరకెక్కించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది . వరుస షోలు..సిరీస్ లతో దూసుకుపోతున్న క్రమంలో ఇలాంటి ఓ ప్రమోషన్ వీడియో ఇప్పుడు ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు త్వరలోనే ఆహా కేరళలో కూడా లాంచ్ అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ కి కేరళలో భారీ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news