Movies"విరూపాక్ష" సినిమాలో రవికృష్ణ పాత్రకు ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..?...

“విరూపాక్ష” సినిమాలో రవికృష్ణ పాత్రకు ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..? అంత మాట్లాడుకున్నాక క్యాన్సిల్..ఎందుకంటే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని కోట్లు ఖర్చు చేసి సినిమా తీశామా కాదు.. ఎంత కష్టపడి కంటెంట్ ఉన్న సినిమాలు తీశామో అన్నది ఇంపార్టెంట్ అన్న విధంగా ప్రజల ఆలోచిస్తున్నారు . కోట్లకు కోట్లు ఖర్చు చేసి సినిమాలు తీస్తే ..సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవుతుంది . ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన సినిమాలు కోట్లకు కోట్లు లాభాలు తీసుకొచ్చి నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుంది . అదే లిస్టులోకి వస్తుంది మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన “విరుపాక్ష” సినిమా .

ఈ సినిమా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏప్రిల్ 21న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే సినిమా మరికొద్ది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరడానికి సిద్ధంగా ఉంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలలో నిర్మాతలకు ఎక్కువ ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమా విరూపాక్షనే కావడం గమనార్హం. కాగా ఈ సినిమాల్లో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన మలయాళీ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటించింది .

ప్రధాన పాత్రలో రవికృష్ణ నటించాడు. మొగిలిరేకులు సిరియల్ ద్వార పాపులారిటి సంపాదించుకున్న రవికృష్ణ రీసెంట్ ఇంటర్వ్యులో మాట్లాడుతూ..” నిజానికి ఈ పాత్రకు వేరే హీరోని అనుకున్నారని ..అయితే ఎందుకు అంత సెలెక్ట్ అయిపోయిన తర్వాత మళ్లీ నన్ను ఆడిషన్ చేసి పాత్రకి తీసుకున్నారో తెలియదని చెప్పకు వచ్చారు”.

ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరో కార్తీక్ . ఎస్ ఈ పాత్రకు ముందుగా ఆయనని ఫిక్స్ చేశారట పారితోషకం కూడా మాట్లాడుకునేసారట . కానీ ఎందుకో లాస్ట్ మూమెంట్లో ఆయన ను తీసేసి రవికృష్ణను సెలెక్ట్ చేశారట . ఏ మాటకు ఆ మాట రవి కృష్ణ.. ఈ సినిమాలో చించేసాడు.. ఈ సినిమా హిట్లలో భాగమయ్యాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news