Moviesసాయితేజ్ ' విరూపాక్ష ' ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్‌కు ప‌క్కా కాపీ… ట్రైల‌ర్‌తో...

సాయితేజ్ ‘ విరూపాక్ష ‘ ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్‌కు ప‌క్కా కాపీ… ట్రైల‌ర్‌తో అడ్డంగా దొరికేశారుగా.. (వీడియో)

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరుపాక్ష సినిమా ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాపై రోజు రోజుకు పాజిటివ్ వైబ్స్ పెరుగుతున్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సాంగ్స్ కూడా సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యాయి. ఇక టీజ‌ర్‌తోనే అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఈ రోజు వ‌చ్చిన ట్రైల‌ర్ అయితే స‌స్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఆక‌ట్టుకుంటోంద‌న్న‌ది నిజం.

సాయితేజ్ కెరీర్‌లో ఫ‌స్ట్ టైం ఈ త‌ర‌హా థ్రిల్ల‌ర్ జాన‌ర్ సినిమాలో న‌టిస్తున్నాడు. ట్రైల‌ర్ చూస్తుంటే
మూఢనమ్మకాలు చేతబడితో పాటు అనేకానేక అంశాల మిక్సింగ్‌తో ఈ సినిమా తెర‌కెక్కింద‌ని తెలుస్తోంది. ట్రైల‌ర్‌ను బ‌ట్టి చూస్తుంటే ఈ సినిమాలో ఓ హీరో ఊరికి వెళ్ల‌డం.. ఆ ఊరి జ‌నాలు అంద‌రూ ఏదో జ‌రుగుతుంద‌ని భ‌య‌ప‌డిపోవ‌డం.. వ‌రుస హ‌త్య‌లు.. ఆ త‌ర్వాత ఆ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీల‌ను హీరో ఎలా ? చేధించాడు ? అన్న కాన్సెఫ్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు.

సాయితేజ్ – హీరోయిన్ సంయుక్త రొమాంటిక్ లవ్ ట్రక్ కూడా హైలెట్ గా ఉంది. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేయగా సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాకు కాంతారా సినిమాకు మ్యూజిక్ అందించిన‌ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించారు. ట్రైలర్ లోనే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. అన్నీ బాగున్నా ఈ సినిమా క‌థ గ‌తంలో వ‌చ్చిన తెలుగు థ్రిల్ల‌ర్ సినిమాల‌ను పోలి ఉండేలా ఉంది.

నిఖిల్ హీరోగా వ‌చ్చి సూప‌ర్ హిట్ అయిన కార్తీకేయ సినిమాలో భ‌యం, స‌స్పెన్స్‌.. హీరో ఒక ఊరికి రావ‌డం.. అక్కడ వ‌రుస‌గా జ‌రుగుతున్న హ‌త్య‌లు.. అయితే హీరో మాత్రం ఆ హ‌త్య‌ల‌ను చేధిస్తాన‌ని స‌వాల్ చేసి.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీల‌ను క‌నిపెట్ట‌డం ఉంటుంది. ఇప్పుడు వీరూపాక్ష కూడా దాదాపు అదే కాన్సెఫ్ట్‌లో తెర‌కెక్కిన‌ట్టుగా ఉంది. ట్రైల‌ర్‌తో పాత కాపీ వాస‌న‌లే ఉన్నాయి. మ‌రి రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఏం జ‌రుగుతుందో ? చూద్దాం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news