MoviesNTR నా మజాకా..ఆ పాట రాగానే తారక్ ఫ్యాన్స్ ఏం చేసారో...

NTR నా మజాకా..ఆ పాట రాగానే తారక్ ఫ్యాన్స్ ఏం చేసారో తెలుసా.. ఇది కదారా అభిమానం అంటే(video)..!!

ఏ మాటకు ఆ మాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ మామూలు వాళ్ళు కాదు. లేకపోతే ఎన్టీఆర్ 30 రిలీజ్ అవ్వకముందే సినిమా ఇండస్ట్రీలోసరికొత్త భజ్ ని క్రియేట్ చేసేస్తున్నారు . మనకు తెలిసిందే కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి . అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ కూడా స్టార్ట్ అయిపోయింది . త్వరలోనే గోవాలో సెకండ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .

ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కాగా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను అనిరుధ్ తాజాగా అమెరికాలో న్యూ జెర్సీలో చేసిన ఓ లైవ్ కాన్ సర్ట్ లో ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన ధీమ్ సాంగ్ ప్లే చేశాడు. అలా ఆ మ్యూజిక్ ప్లే అయ్యిందో లేదో స్టేడియం మొత్తం ఒక్కసారిగా అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది . వాళ్లకి తెలియకుండానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ వచ్చేసాయి .

దీంతో జై ఎన్టీఆర్.. జిందాబాద్ ఎన్ టీఆర్ అంటూ కేకలు అరుపులతో రచ్చ రచ్చ చేసేసారు . ఈ క్రమంలోనే ఎన్టీఆర్ థర్టీ సినిమాకి సంబంధించిన థీమ్ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అంతేకాదు అమెరికా లో ప్రజెంట్ ఈ ధీమ్ సాంగ్ టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా రెండో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news