Newsత్రిష అందం కోసం అంత ఖర్చు చేసారా..? మణిరత్నం కి ఈ...

త్రిష అందం కోసం అంత ఖర్చు చేసారా..? మణిరత్నం కి ఈ పిచ్చేంట్రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి అంటే అందం ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీకి వచ్చి మూడు దశాబ్దాలు దాటుతున్న.. చెక్కుచెదరని అందంతో ఎంతోమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో రాజ్యమేలేస్తున్నారు . కాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోతుంది అందాల ముద్దుగుమ్మ చెన్నై బ్యూటీ త్రిష . ఇండస్ట్రీలోకి వచ్చి ఎంత కాలం అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆల్ మోస్ట్ అందరి హీరోస్ తో నటించి జతకట్టి మెప్పించిన త్రిష ప్రెసెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది.

మరీ ముఖ్యంగా త్రిష లేటెస్ట్ సినిమాలో ఎంత అందంగా కనపడిందో మనందరికీ తెలిసిందే . త్రిష నా లేకపోతే ఎల్లోరా శిల్పమా ..? అన్నంత ఆకర్షణీయంగా కనిపించింది. ఈ క్రమంలోనే త్రిష బయట కనిపించిందానికి.. ఇదివరకు సినిమాలకి.. పోనియన్ సెల్వన్ సినిమాలో కనిపించిన తీరుకి జనాలు ఆశ్చర్యపోతున్నారు . నిజానికి ఐశ్వర్యరాయ్ త్రిష బయట కనిపించింది వేరే ..అయినా పోనియన్ సెల్వన్ సినిమాలో మాత్రం చాలా చక్కగా కనిపించారు .

అయితే దీని అంతటికి కారణం మణిరత్నం అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. మణిరత్నం తన సినిమాలో హీరోయిన్స్ అందం విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటారో మనందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ నీ సన్నగా చూయించడానికి కోట్లు ఖర్చు చేశారట . గ్రాఫిక్స్ ద్వారా ఆమె ఫేసు టోటల్ గా చేంజ్ చేసి ఆమెను ఇదివరకటి ఐశ్వర్య రాయిలా చూపించారట . అంతేకాదు త్రిష అందం కోసం దాదాపు అన్ని ఆయుర్వేదిక్ పద్ధతులను ఫాలో అయ్యి త్రిష అందాలకి మెరుగులు దిద్దాడట. అయితే ఈ విషయం తెలుసుకున్న జనాలు నీకు ఇంకా ఈ పిచ్చి పోలేదా .. హీరోయిన్స్ విషయంలో ఇలాంటి పిచ్చి ఏంటి రా బాబు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news