Moviesప‌వ‌న్ ' భీమ్లానాయ‌క్ ' సినిమాలో రెండు బ్లండ‌ర్ మిస్టేక్‌లు… ఎవ్వ‌రూ...

ప‌వ‌న్ ‘ భీమ్లానాయ‌క్ ‘ సినిమాలో రెండు బ్లండ‌ర్ మిస్టేక్‌లు… ఎవ్వ‌రూ గ‌మ‌నించ‌లేదా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. రీమేక్‌ సినిమాలు చేస్తున్నా సూపర్ హిట్ అవుతున్నాయి. బాలీవుడ్లో అమితాబచ్చన్ ప్రధానపాత్రలో తెర‌కెక్కిన పింక్ సినిమా రీమేక్‌ వకీల్ సాబ్ లో నటిస్తే సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మల్లూవుడ్ లో హిట్ అయినా అయ్యప్ప కోషియం రీమేక్ భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తే ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. భీమ్లానాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరు కలిసి పోటాపోటీగా నటించారు.

ఇంకా చెప్పాలంటే తాను ఒక స్టార్ హీరోను అన్న ఇమేజ్ పక్కన పెట్టి ఒక్కోసారి పవన్ తగ్గి మరి పాత్రకు అనుగుణంగా నటించిన‌ తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. అయితే ఈ సినిమా రచన, స్క్రీన్ ప్లే చేసిన త్రివిక్రమ్ కొన్ని తప్పులు కూడా చేశారు. సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయినా ఆ తప్పులను ఎవరు ? గుర్తించలేకపోయారు.

సినిమాలో దొర్లిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ? ఆంధ్రప్రదేశ్ ఎస్సై.. చివర్లో తెలంగాణ ఎస్సైగా దర్శనమిస్తాడు. కేవలం అది ఐపీఎస్ అధికారులకు మాత్రమే సాధ్యపడుతుంది. కానీ ఎస్సై స్థాయి వాళ్లకు ఇలా రాష్ట్రాలు మార్పు కేవలం సినిమాటిక్ లిబర్టీతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కల్పించాడనే చెప్పాలి.
అలాగే హీరోయిన్ నిత్యామీనన్ తన పాత్రకు బాగా సూట్ అయింది. నటనాపరంగా ఆమెకు వంక పెట్టలేము. అయితే సినిమా కథా నేపథ్యంలో అటవీ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతుంది. నిత్య – ప‌వ‌న్ దంప‌తులు అడ‌విలోనే ఉంటారు.

నిత్యమీనన్ కాస్ట్యూమ్స్ చూస్తే ఆమె అటవీ ప్రాంతంలో ఉన్న మహిళలా అనిపించదు. ఆమె హెయిర్ స్టైల్ చూస్తే అటవీ ప్రాంతంలో కూడా బ్యూటీ పార్లర్ లు ఉంటాయేమో అన్నట్టుగా ఉంది. అటు త్రివిక్రమ్ కానీ.. ఇటు దర్శకుడు సాగర కే చంద్రకాని ఈ రెండు విషయాలను పట్టించుకోలేదు. దాంతో ప్రేక్షకులు కూడా అవేమీ పట్టించుకోకుండా సినిమాను సూపర్ హిట్ చేశారు. అయితే ఆ రెండు మిస్టేక్ లు మాత్రం అలాగే ఉండిపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news