Movies"కాజల్ అగర్వాల్ ని అలా చూడాలి అని ఉంది".. క్రేజీ కోరిక...

“కాజల్ అగర్వాల్ ని అలా చూడాలి అని ఉంది”.. క్రేజీ కోరిక కోరిన తెలుగు స్టార్ హీరో.. గురుడు మంచి రొమాంటిక్ ఫెలోనే..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాజల్ అగర్వాల్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . అంతేనా మొదటి సినిమాతో తన కట్టుబొట్టుతో అందరినీ అట్రాక్ట్ చేసి వావ్ అనిపించి ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో బడా బడిగా అవకాశాలు అందుకుని సూపర్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ లాంటి డేరింగ్ అండ్ డాషికంగ్ డైరెక్టర్ కూడా కాజల్ అందాలకి మెల్ట్ అయిపోయారు.

అంతేనా కాజల్ తో ఓ క్రేజీ కాంబో ఫిక్స్ చేసేసాడు. అదే మహేష్ బాబు – పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన బిజినెస్ మాన్ న. ఈ సినిమాలో ఎలాంటి హాట్ డైలాగ్స్ ఉంటాయో మనందరికీ బాగా తెలిసిందే. ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడే తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు.. కాజల్ ని ఓ కోరిక కోరారు అంటూ అప్పట్లో న్యూస్ వైరల్ అయింది . సాధారణంగా మహేష్ బాబు చాలా సైలెంట్. తనతో వర్క్ చేసే లేడీస్ తో చాలా పద్ధతిగా ఉంటాడు. ఎప్పుడు టంగ్ స్లిప్ అవ్వడు.. కానీ ఎందుకో తెలియదు కానీ ..కాజల్ తో మాత్రం ఆ రోజు సరదాగా ముచ్చటించారట . ఈ క్రమంలోనే ఇప్పటివరకు కాజల్ ఎక్కువగా చిట్టిపొట్టి బట్టల్లో మోడ్రన్ దుస్తుల్లోనే చూశామని,,అయితే ఆమెకు చీర కట్టులో చాలా చక్కగా కనిపిస్తుందని .. తన సినిమాలో ఎక్కువగా చీరకట్టుకే ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పుకొచ్చాడట.

అంతేకాదు ఇప్పటివరకు రొమాంటిక్ , గ్లామరస్, కామెడీ సినిమాలో చూసిన కాజల్ అగర్వాల్ ని హర్రర్ క్యారెక్టర్ లో అయితే చించేస్తుంది అంటూ మహేష్ బాబు ఆనాడే చెప్పారట . కాజల్ అగర్వాల్ లో ఆ స్పెషల్ టాలెంట్ ఉందని ఆమె కళ్ళే ఆమెకు స్పెషల్ అట్రాక్షన్ అని.. మహేష్ బాబు అప్పట్లో కాజల్ గురించి చెప్పుకొచ్చారు అంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి . అంతేకాదు మహేష్ బాబు- కాజల్ ..బిజినెస్ మాన్ సినిమా సీన్స్ అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. మహేష్ బాబు లో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా..? అంటూ కూడా అప్పట్లో జనాలు చర్చించుకున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news