MoviesNTR-Balayya బాల‌య్య కంటి చూపుతో చంపేస్తా డైలాగ్ ఎన్టీఆర్ దేనా…ఆ సీక్రెట్...

NTR-Balayya బాల‌య్య కంటి చూపుతో చంపేస్తా డైలాగ్ ఎన్టీఆర్ దేనా…ఆ సీక్రెట్ ఇదే…!

న‌ట‌ర‌త్న నంద‌మూరి బాలకృష్ణ కెరియ‌ర్ లోని బిగెస్ట్ హిట్ల‌లో న‌ర‌సింహ నాయుడు ఒక‌టి. 2001 సంక్రాంతి కానుకగా చిరంజీవి మృగరాజు ,వెంక‌టేష్ దేవీపుత్రుడు సినిమాలతో పోటి ప‌డుతూ రిలీజ్ అయింది న‌ర‌సింహానాయుడు. భార‌తదేశ సినీచ‌రిత్ర లోనే తొలిసారిగా 100 కేంద్రాల‌లో 100 రోజులు ఆడిన సినిమాగా స‌రికొత్త రికార్డు ఈ సినిమాతో బాల‌య్య సొంతం చేసుకున్నాడు. న‌ర‌సింహానాయుడు సినిమా ఆరోజుల్లో 105 కేంద్రాల‌లో 100 రోజులు ఆడింది. బాల‌య్య – బి.గోపాల్ కాంబినేష‌న్లో హిట్ సినిమాగా న‌ర‌సింహానాయుడు నిలిచింది.

చిన్ని కృష్ణ అందించిన స్టోరీ, బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ , బి.గోపాల్ టేకింగ్ ఈసినిమాను తిరుగులేని సూప‌ర్ హిట్ చేసేసాయి. బాల‌య్య ,బి.గోపాల్ సినిమాల‌లో డైలాగ్స్ ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటాయో తెలిసిందే. ఈ సినిమాలో క‌త్తుల‌తో కాదురా… కంటి చూపుతో చంపేస్తా అనే డైలాగ్ నంద‌మూరి అభిమానులు ఎప్ప‌టికి మ‌ర్చిపోలేరు. ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రాసిన ఈ డైలాగ్ అప్ప‌ట్లో ఒక రేంజ్ లో వైర‌ల్ అయింది. అయితే ఈ డైలాగ్ ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ రాశార‌ని అంద‌రికి తెలిసిన విష‌యం.

కానీ ఈ డైలాగ్ మొద‌ట్ట చెప్పింది మాత్రం సీనియ‌ర్ ఎన్టీఆర్ అవ్వ‌డం విశేషం. న‌ర‌సింహానాయుడు సినిమా రిలీజ్ అయి ఇన్నీ సంవ‌త్స‌రాలవుతున్నా ఇప్ప‌టికి టివీల‌లో వ‌స్తుంటే డైలాగుల కోస‌మే ఈ సినిమాను చూసే అభిమానులు చాలా మందే ఉన్నారు. సీనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల‌లోకి రావ‌టానికి ముందుగా నటించిన‌ సినిమా ‘నా దేశం’ . కె.రాఘ‌వేంద్ర‌రావు సోద‌రుడు కె.బాప‌య్య ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సూప‌ర్ హిట్ అయింది. ఎస్.వెంక‌ట‌ర‌త్న‌, కె.దేవి వ‌ర‌ప్ర‌సాద్ ఈ సినిమాకు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.

హిందీలో సూప‌ర్ హిట్ అయిన బ్లాక్ బాస్ట‌ర్ లావ‌రీస్ కు రీమేక్ గా ‘నా దేశం’ సినిమా తెర‌కెక్కింది. ‘నా దేశం’ సినిమాలో ఫైటింగులు త‌క్కువుగా ఉండ‌టంతో ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఎన్టీఆర్ తో చెప్పి ఒక న‌టుడితో కావాల‌ని ఒక ఫైట్ సీన్ క్రియెట్ చేసారు అయితే సీనియ‌ర్ ఎన్టీఆర్ దేనికైనా ఒక స్థాయి వుండాలి అని… స‌త్యనారాయ‌ణ‌తో ఫైట్ ఉంటే చెప్పండి.. అంతే కానీ మీరు చెప్పిన వాళ్ళ‌తో ఫైట్ చేయ‌డం కుద‌ర‌దు అని చెపేశారు.

మేము గ‌ట్టిగా క‌న్ను ఎర్ర చేస్తే వాళ్ళు గుండె ఆగి చ‌స్తారు.. అని సీనియ‌ర్ ఎన్టీఆర్ ఆ సంద‌ర్బంలో అన్నార‌ట‌. ఎన్టీఆర్ చెప్పిన ఆ డైలాగ్ స్పూర్తిగా తీసుకుని కాస్త అటు ఇటుగా క‌త్తుల‌తో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా అన్న డైలాగ్ పెట్టిన‌ట్టు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ తెలిపారు. అలా ఎన్టీఆర్ మాట నుంచి పుట్టిన ఈ డైలాగ్ ఎంత ఫేమ‌స్ అయిందో అంద‌రికీ తెలిసిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news