MoviesAnnapoorna ప్రేమ విష‌యంలో అన్న‌పూర్ణ‌పై ఇన్ని రూమ‌ర్లు ఉన్నాయా..!

Annapoorna ప్రేమ విష‌యంలో అన్న‌పూర్ణ‌పై ఇన్ని రూమ‌ర్లు ఉన్నాయా..!

కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా.. అమ్మ‌గా.. భార్య‌గా.. అత్త‌గా.. అనేక కోణాల్లో తెలుగు తెర‌పై త‌న విశ్వ‌రూపం చూపించిన న‌టీమ‌ణి అన్న‌పూర్ణ‌. ఆమె కుటుంబానికి సినిమాల‌తో సంబంధం లేదు. అయిన‌ప్ప‌టికీ.. జంధ్యాల ప్రోత్సా హంతో నెమ్మ‌దిగా సినీరంగంలోకి వ‌చ్చారు అన్న‌పూర్ణ‌మ్మ‌.ఆమె భ‌ర్త ఉద్యోగి. సైలెంట్‌. అంతా ఆమెదే పెత్త‌నం. దీంతో సినిమాల్లోనే ఎక్కువ స‌మ‌యం గ‌డిపేవారు.

అయితే.. అన్న‌పూర్ణ‌పై.. కొన్నిరూమ‌ర్లు వ‌చ్చేవి. అవేంటంటే.. ప్రేమికుల‌ను క‌లిపేవార‌ని. అదేంటి? అనుకుంటున్నారా ? అవును.. నిజ‌మే. ఎంత లేద‌న్నా.. సినిమా ఫీల్డ్ అంటేనే.. గ్లామ‌ర్ ఫీల్డ్ సో.. ఇక్క‌డ అందానికే ప్రాధాన్యం ఈ క్ర‌మంలో ప్రేమ‌లో ప‌డేవారు చాలా మందే ఉంటారు. చాలా మంది కెరీర్ ఆరంభంలోనే ఆక‌ర్ష‌ణ‌ల మాటున ప్రేమ‌లో ప‌డిపోతూ ఉంటారు.

ఇలా.. పైకి తెలిసిన హీరో హీరోయిన్లేకాదు.. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న‌వారు.. ఉన్నారు. కొంద‌రికి పెళ్లిళ్లు అయిన త‌ర్వాత కూడా.. ప్రేమ‌లో ప‌డిన వారు ఉన్నారు. వీరికి క‌లుసుకునేందుకు కేరాఫ్ ఏదైనా ఉంటే.. అది అన్న‌పూర్ణ‌మ్మ ఇల్లు. ఆమె ఇల్లే వీరికి స్వ‌ర్గం. ఆమె షూటింగుల‌కు రావ‌డం.. ఆమెకు తెలిసిన వారు.. ఆమె బ్ర‌తిమలాడ‌డం.. వారికి ఆమె ఇల్లు ఇవ్వ‌డం.. ఇలా సాగేద‌ట‌.

అంటే.. ఇదంతా ప్రేమ‌తోనే చేసేవార‌ట‌. బ‌య‌ట‌కు వెళ్తే ప‌రువు పోతుంద‌ని.. భావించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు ఇలా.. అన్న‌పూర్ణ‌మ్మ ఇంటిని గెస్ట్ హౌస్‌గా వాడేసుకునేవార‌ట‌. వీరి తాకిడి త‌ట్టుకోలేక‌.. అన్న‌పూర్ణ‌.. ఇంట్లో ఏకంగా.. ఒక గెస్ట్ రూమ్ ప్ర‌త్యేకంగా కేటాయించేశార‌ట‌. ఇదీ.. సంగ‌తి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news