Moviesఈ ప్రపంచంలో నన్ను అలా చూసిన వ్యక్తి అతడే.. ఇద్దరు బిడ్డలు...

ఈ ప్రపంచంలో నన్ను అలా చూసిన వ్యక్తి అతడే.. ఇద్దరు బిడ్డలు పుట్టాక అసలు విషయం చెప్పేసిన యాంకర్ లాస్య ..!

స్టార్ యాంకర్ గా చాలా కాలం పాటు ఒక వెలుగు వెలిగింది లాస్య. లాస్య అంటేనే సరదా సరదాగా మాట్లాడుతూ తన యాంకరింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. తెలుగు ఆడియోన్స్ లో ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. లాస్య, రవి కలిసి చేసిన ఎన్నో షోలు ఎంతో పెద్ద హిట్ అయ్యాయి. లాస్య ఎంత మంచి యాంకర్ ఆయినా… ఎప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్లు బయటకు వచ్చేవి. అయితే వాటిని ఎప్పుడూ పట్టించుకోని లాస్య కొన్నాళ్ల క్రితం వివాహం చేసుకొని అమెరికాలో సెటిల్ అయింది. లాస్య భర్త మంజునాథ్ అనే వ్య‌క్తి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమె ప్రస్తుతం తన భర్త పిల్లలతో కలిసి సంతోషంగా ఫ్యామిలీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది.

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ వచ్చే లాస్య తన ఫ్యామిలీతో పాటు తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ తన అభిమానులను ఆనందపరుస్తూ ఉంటుంది. లాస్య పెళ్లి తర్వాత బిగ్బాస్ సీజన్ 4 లో ఒక కంటెంట్‌గా పాల్గొన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఈ దంపతులకు రెండో సంతానం కూడా కలిగింది. లాస్య రెండోసారి కూడా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో చెబుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.

తాజాగా లాస్య భర్త మంజునాథ్ బర్త్ డే సందర్భంగా ఆమె ఎంతో ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ చేసింది.
తన భర్త గురించి చెబుతూ లాస్య తీవ్ర భావోద్వేగానికి గురైంది. తనకు పర్ఫెక్ట్ హస్బెండ్ అని… అలాంటి వ్యక్తికి తాను భార్య అయినందుకు గర్వపడుతున్నా…. ఈ ప్రపంచంలో నా పిచ్చితనాన్ని భరించే ఏకైకే వ్యక్తివి నువ్వే హ్యాపీ బర్త్ డే మంజునాథ్.. నన్ను నువ్వు నవ్వించావు.. నా కన్నీళ్లు తుడిచావు.. నా సక్సెస్ చూశావు.. కష్టాల్లో ఉన్నప్పుడు నా పక్కనే ఉండి నిలబడ్డావు నా సంతోషానికి కారణం నువ్వే అంటూ చాలా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

అలాగే ఈ సందర్భంగా భర్తతో ప్రేమగా సంతోషంగా ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది. ఈ ఫోటో నెటిజన్లను ఇప్పుడు విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతా మంజునాథ్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ ఫోటోలో లాస్య తన భర్త చేతిలో బందీగా అయ్యి చిరునవ్వులు చిందిస్తోంది. ఇద్ద‌రు బిడ్డ‌ల త‌ల్లి అయిన లాస్య ఈ గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఉన్నా భ‌ర్త నుంచి ల‌భిస్తోన్న స‌హకారంతో చాలా ఎంజాయ్‌గా ఉంద‌ని ఆమె మాట‌లే చెపుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news