MoviesMega Heroes మెగా ఫ్యామిలీలో ఆ ముగ్గురు త‌ప్పా మిగిలిన హీరోలు...

Mega Heroes మెగా ఫ్యామిలీలో ఆ ముగ్గురు త‌ప్పా మిగిలిన హీరోలు స‌క్సెస్ కాక‌పోవ‌డానికి ఇదే కార‌ణ‌మా ?

మెగా హీరోలలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ స్టార్ హీరో స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు ఇతర భాషల్లో కూడా ఊహించని స్థాయిలో పాపులారిటీని పెంచుకున్నారు. చరణ్ కు ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు దక్కగా హరిహర వీరమల్లుతో పవన్ కూడా ఈ గుర్తింపును సొంతం చేసుకోనున్నారు. పవన్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రావాలని అభిమానుల ఆకాంక్ష అనే సంగతి తెలిసిందే.

ఈ హీరోలతో పాటు మెగా ఫ్యామిలీ నుంచి సాయితేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే చిరు, పవన్, చరణ్ స్థాయిలో ఈ హీరోలు సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. అయితే ఈ హీరోలకు స్టార్ స్టేటస్ దక్కకపోవడానికి కారణమేంటనే ప్రశ్నలకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి. సాయితేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సినిమాలు పరిమిత బడ్జెట్ తోనే తెరకెక్కుతుండటం గమనార్హం.

ఈ హీరోల సినిమాలలో కొన్ని సినిమాలు సక్సెస్ సాధిస్తున్నా మరీ భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించకపోవడం ఈ హీరోలకు ఒకింత మైనస్ అవుతోంది. అదే సమయంలో స్టార్ డైరెక్టర్లు ఈ మెగా హీరోలపై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. టైర్1 డైరెక్టర్లు ఈ హీరోలపై దృష్టి పెట్టకపోవడం కూడా ఈ మెగా హీరోల పాలిట శాపంగా మారిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కొంతమంది ఫ్లాప్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా కూడా సాయితేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మెగా హీరోలు నటించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భయంకరమైన డిజాస్టర్లుగా నిలిచాయి. మినిమం గ్యారంటీ హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోలేకపోవడం, కథల ఎంపికలో చేస్తున్న పొరపాట్లు, సొంతంగా ఫ్యాన్ బేస్ ను పెంచుకోవడంలో ఫెయిల్ కావడం, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడం కూడా మెగా హీరోలకు మైనస్ అవుతోంది.

ఈ ముగ్గురు హీరోలు పూర్తిస్థాయి మాస్ కథాంశాలపై , మాస్ సినిమాలపై దృష్టి పెట్టకపోవడం వల్ల కూడా ఈ హీరోలు కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కోవడానికి కారణమవుతోంది. మరింత కష్టపడితే మాత్రం ఈ మెగా హీరోలు రాబోయే రోజుల్లో మాత్రం స్టార్ స్టేటస్ ను పొందే ఛాన్స్ అయితే ఉంది. మెగా బ్యాగ్రౌండ్ ఈ హీరోలకు ప్లస్ అవుతుండగా సోలో హీరోలుగా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు సొంతం చేసుకునే స్థాయికి ఈ హీరోలు ఎదుగుతారేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news