MoviesSuma "యాంకరింగ్ అయినా మానేస్తా.. ఆ షో కి మాత్రం హోస్ట్...

Suma “యాంకరింగ్ అయినా మానేస్తా.. ఆ షో కి మాత్రం హోస్ట్ చేయను”..సుమ అంతలా హర్ట్ అయ్యిందా..?

బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా.. యాంకరింగ్ అనగానే మనందరికీ గుర్తువచేది యాంకర్ సుమ . కొన్నేళ్లుగా వెండొ తెరను బుల్లితెరను తనదైన స్టైల్ లో రాజ్యం ఏలేస్తూ చక్రం తిప్పుతున్న సుమ మరికొన్నిళ్లపాటు కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోవడానికి సిద్ధపడుతుంది . ఇప్పటికే పలు ప్రముఖ చానల్స్ లో మంచి మంచి ప్రోగ్రామ్స్ లో దూసుకుపోతున్న సినిమా రాబోయే కాలంలో మరిన్ని కొత్త ప్రోగ్రామ్స్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. అయితే యాంకర్ సుమ ఎన్ని షో స్ కి యాంకరింగ్ హోస్ట్ గా చేసిన ఒక్క షోకు మాత్రం యాంకరింగ్ చేయను అంటూ బల్ల గుద్ది చెప్పేస్తుందట.

ఆ షో మరేదో కాదు జబర్దస్త్ . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. బుల్లితెర పై టాప్ టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ షో కి ఎప్పటికి నేను హోస్ట్ గా చేయను అంటూ సుమా చెప్పుకు వచ్చిందట . ఇప్పటికే యాంకర్ అనసూయ జబర్దస్త్ నుండి వెళ్ళిపోయిన తరువాత సుమ ని తీసుకోవాలని భావించారట . అప్పుడు కూడా సుమా రిజెక్ట్ చేసింది . అంతక ముందు షో స్టార్టింగ్ అప్పుడు కూడా జబర్దస్త్ షో పెట్టిన కొత్తల్లో సుమని యాంకర్ గా అడిగారట .

అప్పుడు కూడా నో చెప్పిందట . దానికి మెయిన్ రీజన్ జబర్దస్త్ అంటూ తెలుస్తుంది . సరదాగా ఏ పని చేసిన తీసుకునే సుమ.. హద్దులు మీరితే మాత్రం రప్ఫాడించేస్తుంది. ఈ క్రమంలోనే ఉన్న పేరుని చెడ్డపేరుగా మార్చుకోకూడదు అని అలాంటి షోస్ కి హోస్ట్ చేయనని తన రూల్స్ బ్రేక్ చేయకుండా వెళ్తుంది. ఫ్యాన్స్ కూడా సంతోషపడుతున్నారు . నువ్వు నీలాగే ఉండు అలాంటి షూస్ కి పోస్ట్ చేయొద్దు అంటూ సొల్యూషన్స్ ఇస్తున్నారు. సుమ..చెత్త షోల జోలికి వెళ్లకు..అంటూ సజీషన్స్ ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news