MoviesBahubhali సినిమాలో కట్టప్ప రోల్ ని మిస్ చేసుకున్న అన్ లక్కి...

Bahubhali సినిమాలో కట్టప్ప రోల్ ని మిస్ చేసుకున్న అన్ లక్కి పర్సన్ ఎవరో తెలిస్తే..షాక్ అయిపోతారు..!!

Bahubhali బాహుబలి.. ఈ పేరు చెప్తేనే తెలుగు జనాలకు అదేదో తెలియని పులకరింపు వచేస్తుంది . తెలియకుండానే గూస్ బంప్స్ వచ్చేస్తాయి . ఇప్పటికి మనకి బాహుబలి సినిమా ఎంత ప్రత్యేకమో మనందరికీ తెలిసిందే . టీవీలో ఇప్పటికే ఎన్నోసార్లు వచ్చిన ఈ సినిమా వచ్చిన ప్రతిసారి చూస్తుంటే కొత్త ఫీలింగ్ కలుగుతుంది . కానీ ఎక్కడ బోర్ కొట్టదు ..తెలిసిన కథ అయినా తెలిసిన యాక్ట్రెస్ ఉన్నా కానీ సినిమా కోసం ఎగబడి ఎగబడి టీవీకి అతుక్కుపోయి చూస్తూ ఉంటాం.

అలాంటి ఓ సరికొత్త కంటెంట్ ని క్రియేట్ చేస్తూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే బిగ్గెస్ట్ రికార్డ్ నెలకొల్పేలా తీశాడు దర్శకధీరుడు రాజమౌళి . ఈ సినిమాతోనే రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఈ సినిమా సాధించిన విజయాలను.. కొల్లగొట్టిన రికార్డులు మరి ఏ సినిమా అందుకోలేదు.. అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాగా ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి గా ప్రభాస్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నాడో.. భళ్ళాల దేవుడిగా రానా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో.. అంతకు డబల్ రేంజ్ లో కట్టప్ప పాత్ర పోషించిన సత్యదేవ్ పాపులారిటి సంపాదించుకున్నాడు .

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అంటూ ప్రపంచ దేశాలు కొన్నాళ్లు చర్చించుకున్నాయి. ఆ తర్వాత బాహుబలి పార్ట్ 2 వచ్చాక అసలు ట్విస్ట్ బయటపడింది . కాగా నిజానికి ఈ సినిమాలో కట్టప్ప రోల్ అనుకోగానే రాజమౌళి ముందు అనుకున్న హీరో మోహన్ లాల్. ఎస్ మలయాళం లో స్టార్ నటుడుగా పేరు సంపాదించుకున్న మోహన్ లాల్.. ఈ పాత్రకు కరెక్ట్ గా సరిపోతాడు అని రాజమౌళి అనుకున్నారట . అయితే మోహన్ లాల్ ఈ పాత్ర విన్న తర్వాత పాత్ర నచ్చక రిజెక్ట్ చేశాడట.

ఇక ఆ తర్వాత ఈ పాత్రకి ఎంతోమంది నటీనటులను చూస్ చేసుకోగా.. ఫైనల్లీ రమా రాజమౌళి సత్యరాజ్ ను ఈ పాత్రకు ఫైనల్ చేశారట . ఇప్పుడు ఈ పాత్ర ఎవరు చేసినా మెప్పించలేరు . సత్యరాజ్ చేస్తేనే మెప్పిస్తాడు అనేలా ఆయన పాత్రకు న్యాయం చేశాడు. ఇప్పటికీ సత్యరాజ్ ను చూస్తే చిన్న పిల్లలు సైతం కట్టప్ప అని అంటారు.. కానీ సత్యరాజ్ అని ఎవరు అన్నారు.. అంతలా ఆయన తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news