Moviesబ్రేకింగ్‌: అఖండ 2 అప్‌డేట్ వ‌చ్చేసింది… షూటింగ్ ఎప్పుడంటే..

బ్రేకింగ్‌: అఖండ 2 అప్‌డేట్ వ‌చ్చేసింది… షూటింగ్ ఎప్పుడంటే..

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలు అఖండ‌, వీర‌సింహారెడ్డి. బాల‌య్య‌కు చాలా రోజుల త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ రెండు వ‌రుస హిట్ల ప‌డ్డాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ బ‌యోపిక్‌లు రెండు, ఆ త‌ర్వాత వ‌చ్చిన రూల‌ర్ ఇలా మూడు పెద్ద ప్లాపుల త‌ర్వాత బాల‌య్య అఖండ‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అఖంగ గ‌ర్జ‌న మోగించాడు. పైగా ఏపీలో టిక్కెట్ రేట్లు త‌క్కువుగా ఉండ‌డంతో పాటు క‌రోనా క్రైసెస్ త‌ర్వాత వ‌చ్చిన అఖండ మామూలు హిట్ కాదు.. పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్‌

నిజంగా ఏపీలో టిక్కెట్ రేట్లు మామూలుగా ఉండి ఉంటే అఖండ వ‌సూళ్లు మ‌రింత‌గా ఉండేవి. అస‌లు 100 రోజుల పోస్ట‌ర్లు జ‌నాలు మ‌ర్చిపోతోన్న టైంలో అఖండ ఏకంగా నాలుగు కేంద్రాల్లో డైరెక్టుగా 100 రోజులు ఆడింది. అందులో మూడు కేంద్రాలు ఒక్క క‌ర్నూలు జిల్లాలో ఉండ‌గా.. చిల‌క‌లూరిపేట‌లో కూడా 100 రోజులు ఆడింది. అఖండ త‌ర్వాత బాల‌య్య వీర‌సింహారెడ్డి చేశాడు. అది కూడా సూప‌ర్ హిట్‌.

ఇక అఖండ హిట్ అయిన‌ప్ప‌టి నుంచి కూడా ఆ సినిమాకు సీక్వెల్ వ‌స్తుంద‌న్న ప్ర‌చారం న‌డిచింది. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కూడా అఖండ‌కు సీక్వెల్ ఉంద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం బాల‌య్య అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ పేరు కూడా లైన్లో ఉంది. ఇక అనిల్ రావిపూడి సినిమా త‌ర్వాతే అఖండ 2 ఉండే ఛాన్సులు క‌నిపిస్తున్నాయి.

నంద‌మూరి అభిమానుల‌కు మంచి ఊపు ఇచ్చేలా అఖండ మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ అఖండ సీక్వెల్ అఖండ 2పై క్లారిటీ ఇచ్చేశారు. థ‌మ‌న్ మ‌హాశివ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలుపుతూ త్వ‌ర‌లోనే అఖండ 2తో క‌లుద్దాం అని విషెస్ చెప్పాడు. దీంతో అఖండ సీక్వెల్ స‌న్నాహాలు మొద‌లైపోయాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం బోయ‌పాటి రామ్‌తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్త‌యిన వెంట‌నే అఖండ 2 తెర‌కెక్క‌నుంది. ఏదేమైనా అఖండ 2 ఎనౌన్స్ చేయ‌డంతో సినీ ల‌వ‌ర్స్‌లో ఆస‌క్తి ఏర్ప‌డింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news