Moviesశ్రీముఖితో చిరంజీవికి ముడ‌త‌లు ప‌డిన న‌డుం సీన్‌... ఇంత ర‌చ్చ న‌డుస్తోందా...!

శ్రీముఖితో చిరంజీవికి ముడ‌త‌లు ప‌డిన న‌డుం సీన్‌… ఇంత ర‌చ్చ న‌డుస్తోందా…!

ఈ ఏజ్‌లో మెగాస్టార్ చిరంజీవి రొమాంటిక్స్ సీన్స్ చేయడం అంటే జనాలకి తిక్కరేగి థియేటర్స్‌లో నుంచి లేచి వెళ్ళిపోతారు. అందరు వాడు సినిమాలో టబుతో ఉన్న సీన్స్ చూసే వెటకారంగా నవ్వారు. ఇప్పుడేమో ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలోని సీన్స్‌ను రీమేక్ చేస్తున్నారట. ఆ సీన్ ఖుషి సినిమాలోది. ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ భూమిక కలిసి నటించిన ఖుషి సినిమాలో ఇంట్రవెల్ సీన్స్ ఏ ఒక్కరూ మర్చిపోరు.

తమిళం, హిందీ, తెలుగులో రూపొందిన ఈ సినిమా మిగతా భాషల కంటే తెలుగులోనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేసింది. ఇంట్రవెల్ ముందు వచ్చే భూమిక – పవన్ కళ్యాణ్‌ల సీన్స్ హైలెట్. పవన్ భూమిక నడుము చూసినందుకు జరిగే గొడవ వల్ల ఎలాంటి ఇంటెన్సిటీ క్రియేట్ అవుతుందో అందరికీ తెలిసిందే. అస‌లు అప్ప‌ట్లో ఈ ఒక్క సీన్ వ‌ల్లే ఈ సినిమా సిల్వ‌ర్ జూబ్లీలు ఆడ‌డంతో పాటు రికార్డుల దుమ్ము దులిపేసింది.

రొమాంటిక్ గా చూపిస్తూనే ఇద్దరి మధ్య దూరం పెంచేలా డిజైన్ చేశారు. అయితే, అప్పట్లో అందరి ఫేవరేట్ సీన్ అయిన ఈ నడుము సీన్‌ను ఇప్పుడు చిరంజీవి చేయబోతున్నారట. అది కూడా బులీతెర హాట్ యాంకర్ శ్రీముఖితో..! మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. తమన్నా హీరోయిన్‌గా కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా కనిపించబోతున్నారు.

మరి శ్రీముఖికి చిరుకి ఎలాంటి సీన్స్ ఉంటాయోగానీ శ్రీముఖి నడుమూ చూస్తుంటే చిరంజీవిపై రంకెలు వేసే సీన్స్‌లో యాంకర్ నటించిందట. శ్రీముఖి నడుము..ఆ మడత బొడ్డు చూడటానికి చాలా బావున్నా చిరంజీవి చూడటం అంటే అబ్బే అంటున్నారు. మామూలుగా చిరు ఈ వ‌య‌స్సులో డీసెంట్ సీన్స్ చేస్తేనే ఓవర్ యాక్షన్ అంటున్నారు ఇప్పుడు.

అలాంటి మెగాస్టార్ ఇలాంటి సిల్లీ సీన్‌లో నటిస్తే ఎలా చేసుకుంటారు ? ఈ సీన్ ఎలా పండుతుంద‌న్న దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లోనూ, ఇటు సోష‌ల్ మీడియాలోనూ న‌డుస్తున్నాయి. మ‌రి ఈ సీన్ ప‌వ‌న్ – భూమిక సీన్‌ను మై మ‌రిపిస్తుందా ఆ స్థాయి మ్యాజిక్ చేస్తుందా ? లేదా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news