Moviesఓటీటీలో బాల‌య్య వేట‌... వీర‌సింహారెడ్డి రికార్డుల ఆట... ఒక్క నిమిషంలోనే సెన్షేష‌న‌ల్...

ఓటీటీలో బాల‌య్య వేట‌… వీర‌సింహారెడ్డి రికార్డుల ఆట… ఒక్క నిమిషంలోనే సెన్షేష‌న‌ల్ రికార్డ్‌…!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా శృతిహాసన్ – హనీరోజ్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత బాలయ్య నటించిన ఈ సినిమా హై రేంజ్ అంచనాలతో థియేటర్లలోకి దిగింది. ఈ సంక్రాంతికి మరోవైపు చిరంజీవి, రవితేజ కలిసి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాకు పోటీగా రంగంలోకి దిగిన విరసింహారెడ్డి సినిమాకు మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించారు.

బాలయ్య కెరీర్ లోనే ఎప్పుడో లేనట్టుగా తొలి రోజు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా రు. 54 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా దక్కించుకుంది. అసలు బాలయ్య సినిమాకు తొలి రోజు ఈ రేంజ్‌లో వసూళ్లు రావటం ప్రతి ఒక్కరికి మైండ్ బ్లోయింగ్ అనిపించింది. బాలయ్య చివరి బ్లాక్ బస్టర్ హిట్ అఖండను మించిన పెద్దహిట్‌ గా వీరసింహారెడ్డి నిలిచింది. తాజాగా ఇప్పుడు వీర సింహారెడ్డి డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది.

తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి నిమిషం నుంచే రికార్డుల వేట మొదలు పెట్టేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్‌కి జస్ట్ ఒక్క నిమిషంలోనే ఏకంగా 1.50 లక్షలకు పైగా యూనిక్ వ్యూస్‌ వచ్చాయి. ఓటిటి హిస్టరీలోనే వీర‌సింహారెడ్డి ఈరోజు సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. బాలయ్యకు గత రెండు సంవత్సరాలుగా అటు వెండితెర పైన… ఇటు బుల్లితెర పైన తిరుగులేని క్రేజ్ కనిపిస్తోంది.

ఆ క్రేజ్ కు సాక్ష్యంగా అన్‌స్టాప‌బుల్ ఎపిసోడ్లు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో… ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమా కూడా ఓటీటీ లోను అదిరిపోయే సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒక్క నిమిషంలోనే 1.50 లక్షలకు పైగా వ్యూస్ అంటే అది అలాంటి.. ఇలాంటి రికార్డు కాదనే చెప్పాలి. మైత్రి మూవీస్ బ్యానర్ పై తెర‌కెక్కిన ఈ సినిమాకు సంగీతం అందించారు. రెండు వరుస సూపర్ డూపర్ హిట్లతో ఉన్న బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నారు. వచ్చే దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news