Movies"ఫైనల్లీ నోరు విప్పిన అల్లు అరవింద్".. అల్లు అర్జున్ భార్యపై...

“ఫైనల్లీ నోరు విప్పిన అల్లు అరవింద్”.. అల్లు అర్జున్ భార్యపై సెన్సేషనల్ కామెంట్స్..!!

మల్టీ టాలెంటెడ్ కమెడియన్ కం హీరో సుహాస్ .. రీసెంట్ గా నటించిన సినిమా రైటర్ పద్మభూషణ్ . తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. సూపర్ సక్సెస్ అందుకుంది . ఈ సినిమా ఇంతటి ఘనవిజయం కావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. కాగా ఈ సక్సెస్ మీట్ కి అల్లు అరవింద్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. మనకు తెలిసిందే అల్లు అరవింద్ ఏదైనా ఈవెంట్ గాని వచ్చి స్టేజి పైకి ఎక్కి మైక్ పడితే చాలు ఏదో ఒక కొత్త విషయాన్ని చెబుతూ ఫాన్స్ ను ఉత్సాహపరుస్తూ ఉంటాడు.

సాధారణం కొందరు గా స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడుతూ ఉంటే సుత్తి కొట్టినట్లు ఉంటుంది . ఎప్పుడెప్పుడు ఈయన స్టేజ్ దిగిపోతాడా అంటూ తలలు పట్టుకుంటారు .అయితే అల్లు అరవింద్ఫ్ మాట్లాడితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉంటుంది . అదే ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశాడు అల్లు అరవింద్. స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడుతూ రైటర్ పద్మభూషణ్ చిత్ర డైరెక్టర్ ఓ రేంజ్ లో ప్రశంసిస్తూ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలే ఉండాలి అంటూ పొగిడేసారు .

కాగా ఇదే క్రమంలో తన ఇంటి కోడలు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు . “ఈ సినిమా చూడక ముందు నుంచి కూడా నాకు ఓ అభిప్రాయం ఉండేది ఇంట్లోని ప్రతి ఆడపిల్ల ఇంటికి వచ్చిన కోడలు తో సహా ఎవరు ఖాళీగా ఉండకూడదు . తమ కాళ్ళపై వాళ్లు నిలబడాలి. ఆడపిల్లలంటే వంటింటికి పరిమితం అయిపోకూడదని నా భావన.. ఈ సినిమా చూశాక మరింత ఎక్కువగా ఆ విషయాన్ని నేను ప్రోత్సహిస్తున్నాను. మా కోడలు స్నేహ కి పనిచయాల్సిన అవసరం ఏముంది ..పుట్టుకతోనే ధనవంతురాలు.. అల్లు అర్జున్ లాంటి బిగ్ స్టార్ ని పెళ్లి చేసుకున్నాక మరింత ధనవంతురాలుగా మారిపోయింది ..అయినా కానీ స్నేహ రెడ్డి ఇంకా వర్క్ చేస్తుంది.. అది నాకు ఎంతో గర్వకారణం ..అల్లు స్నేహ ఆన్లైన్ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే . ఇలా అల్లు స్నేహారెడ్డి పై అల్లు అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news