Moviesటాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ర‌కుల్‌కు ఘోర అవ‌మానం... క‌న్నీళ్లు పెట్టేసుకుందా..!

టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ర‌కుల్‌కు ఘోర అవ‌మానం… క‌న్నీళ్లు పెట్టేసుకుందా..!

పంజాబీ ముద్దుగుమ్మ ర‌కుల్‌ప్రీత్ సింగ్ నార్త్‌లో సినిమా ఛాన్సుల కోసం వెయిట్ చేస్తూ టాలీవుడ్‌లో చిన్న చిన్న సినిమాల‌తో ముందుగా హీరోయిన్ అయ్యింది. ఆ త‌ర్వాత పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు రావ‌డంతో టాలీవుడ్‌ను మూడు సంవ‌త్స‌రాల పాటు దున్నేసింది. వ‌రుస‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్‌, బ‌న్నీ, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేష్‌బాబు, సాయిధ‌ర‌మ్‌తేజ్ లాంటి హీరోల ప‌క్క‌న సినిమాలు చేసుకుంటూ పోయింది.

ఇక్క‌డ క్రేజ్ ఉండ‌గానే బాలీవుడ్‌పై మోజుప‌డిన ర‌కుల్ అక్క‌డా, ఇక్క‌డా అంటూ రెండు ప‌డ‌వ‌ల‌పై కాలేసింది. దీంతో తెలుగులో కొత్త హీరోయిన్లు ఎంట‌ర్ కావ‌డంతో ర‌కుల్‌ను ఇక్క‌డ జ‌నాలు ప‌ట్టించుకోవ‌డం మానేశారు. సేమ్ ఇలియానా ఎలాంటి త‌ప్పే చేసిందో ర‌కుల్ కూడా టాలీవుడ్ విష‌యంలో అదే త‌ప్పు చేసింది. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఆమెకు త‌మిళంలో ఇండియ‌న్ 2తో పాటు అయ‌లాన్ సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చాయి.

తెలుగులో ఆమె ఫుల్ స్వింగ్‌లో ఉన్న‌ప్పుడు ఓ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ రావ‌డం.. కొంత షూటింగ్ జ‌రిగాక ఆమెను త‌ప్పించేయ‌డం జ‌రిగాయి. ఈ విష‌యం చాలా రోజుల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది పెద్ద అవ‌మానంగా ఫీల్ అయిన ర‌కుల్ క‌న్నీళ్లు కూడా పెట్టుకుంద‌ట‌. దిల్ రాజు బ్యాన‌ర్లో మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ వ‌చ్చింది. ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ఈ సినిమాలో ముందుగా ర‌కుల్‌ను హీరోయిన్‌గా తీసుకుని కొంత పార్ట్ షూట్ చేశారు.

అయితే ర‌కుల్ బ‌క్క‌గా ఉంద‌ని.. ప్ర‌భాస్‌కు జోడీగా సెట్ కాద‌ని డిసైడ్ అయ్యి ఆమెను త‌ప్పించేశారు. అయితే అప్ప‌టికే దిల్ రాజు బ్యాన‌ర్లో ఆర్య 2 సినిమా చేస్తోన్న కాజ‌ల్‌తో మాట్లాడి ఆమెనే హీరోయిన్‌గా తీసేసుకున్నారు. అలా ప్ర‌భాస్ ప‌క్కన కూడా న‌టించాల్సిన ల‌క్కీ ఛాన్స్‌ను ర‌కుల్‌ప్రీత్ మిస్ అయ్యింది. అయితే ఈ సినిమా ఛాన్స్ పోవ‌డం త‌న కెరీర్‌లో ఎప్ప‌టీకీ బ్యాడ్ అని ఆమె బాధ‌ప‌డుతూనే ఉంటుంద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news