Moviesపెళ్లిసంద‌డి హీరోయిన్ ర‌వ‌ళి త‌న‌కంటే చిన్నోడిని పెళ్లి చేసుకుందా.. ఇలా అయిపోయిందేంటి..!

పెళ్లిసంద‌డి హీరోయిన్ ర‌వ‌ళి త‌న‌కంటే చిన్నోడిని పెళ్లి చేసుకుందా.. ఇలా అయిపోయిందేంటి..!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ ర‌వ‌ళి గుర్తుందా ? అంటే ఈ త‌రం జ‌నానికి చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే ఆమె గుర్తుంటుంది. ర‌వ‌ళి 20 ఏళ్ల క్రితం టాలీవుడ్‌లో మంచి గుర్తింపే తెచ్చుకుంది. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ హీరోగా వ‌చ్చిన పెళ్లిసంద‌డి సినిమాలో మెయిన్ హీరోయిన్ దీప్తి భ‌ట్నాగ‌ర్‌కు చెల్లిగా ర‌వ‌ళి న‌టించింది.

 

ర‌వ‌ళి తెలుగ‌మ్మాయే. ఆమె అక్క హ‌రిత కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌యం. హ‌రిత సీరియ‌ల్స్ ద్వారా కూడా బాగా పాపుల‌ర్ అయ్యింది. పెళ్లిసంద‌డి త‌ర్వాత త‌న‌కు వ‌చ్చిన క్రేజ్‌తో ర‌వ‌ళి ఇటు తెలుగుతో పాటు అటు త‌మిళంలోనూ స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించింది. 18 ఏళ్ల‌కే న‌టిగా కెరీర్ ప్రారంభించిన ర‌వ‌ళి ఆ త‌ర్వాత చాలా యేళ్ల పాటు కెరీర్ కొన‌సాగించింది.

ఇక కాస్త లేట్ ఏజ్‌లో త‌న‌కంటే వ‌య‌స్సులో చిన్నోడు అయిన వ్య‌క్తినే ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు గుడ్ బై చెప్పేసిన ర‌వ‌ళి చాలా రోజుల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌తేడాది శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ న‌టించిన‌ పెళ్లిసంద‌డి సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు కోరిక మేర‌కు వ‌చ్చింది.

అప్పుడు ఆమెను చూస్తే అస్స‌లు గుర్తుప‌ట్ట‌లేని విధంగా మారిపోయింది. ఆమెతో ఆ సినిమాలో క‌లిసి చేసిన దీప్తి భ‌ట్నాగ‌ర్ ప‌ర్స‌నాలిటీలో పెద్ద‌గా మార్పు రాలేదు. అయితే ర‌వ‌ళి మాత్రం బాగా ఒళ్లు చేసేసి లావెక్కిపోయింది. ఇక తాజాగా ఆమె తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చారు. అస‌లు ఆమెను చూస్తే పెళ్లిసంద‌డి ర‌వ‌ళి ఈమేనా ? అన్నంత‌గా మారిపోయింది. ర‌వ‌ళి తాజా ఫొటోలు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news