Moviesఇంట్లో ఎంతమంది మెగా హీరోలు ఉన్నా..చిరంజీవి ఫేవరెట్ స్టార్ అతడే..!!

ఇంట్లో ఎంతమంది మెగా హీరోలు ఉన్నా..చిరంజీవి ఫేవరెట్ స్టార్ అతడే..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూ ఎటువంటి హెల్ప్ సపోర్ట్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగి ఆ తర్వాత ఇండస్ట్రీలో మెగాస్టార్ గా రాణిస్తున్నాడు . మెగాస్టార్ పేరు జపించి ఆయనను ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోలు చాలామంది ఉన్నారు. అయితే ఆయన పేరును ఉపయోగించి మెగాస్టార్ అనే ట్యాగ్ ను వాడుకుంటూ ఇండస్ట్రీ ఇండస్ట్రీలోకి వచ్చిన వారు ఉన్నారు.

అయితే ఎవరు కూడా మెగాస్టార్ స్థాయిని రీచ్ కాలేపోయారు . అయితే ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్న చిరంజీవికి మాత్రం టాలీవుడ్లో ఓ హీరో అంటే చాలా ఇష్టం . అంతేకాదు మెగా హీరోల సినిమాలు రిలీజ్ అయిన సరే మొదటగా ఆ హీరో సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడట . ఆయన మరెవరో కాదు టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ తెచ్చుకున్న తారక్ .

మెగాస్టార్ చిరంజీవికి తారక్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట . =అన్ని సినిమాల్లో తారక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి ఆయనకు పర్సనల్గా కాల్ చేసి మరిపొగిడేస్తారట . ఆర్ ఆర్ ఆర్ సినిమా టైంలోనూ తారక్-చరణ్ ఇద్దరు పోటాపోటీగా నటించినా ..చరణ్ కన్నా తారక్ పర్ఫామెన్స్ ఎక్కువగా నచ్చింది అంటూ ఓపెన్ గానే చెప్పేసాడు చిరంజీవి. ఇలా టాలెంట్ ఎక్కడ ఉంటే అక్కడ నిజాయితీగా ఆన్సర్ ఇచ్చి ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ .. అందుకే ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీ మెగాస్టార్ గా ఎదిగిపోయాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news