Moviesఅడిగి మరి తన సినిమాలో అవకాశం ఇచ్చిన బాలయ్య.. ఆ ఒక్కడు...

అడిగి మరి తన సినిమాలో అవకాశం ఇచ్చిన బాలయ్య.. ఆ ఒక్కడు అంత స్పెషలా..?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య పవర్ఫుల్ లుక్ లో రీసెంట్గా కనిపించిన సినిమా వీరసింహారెడ్డి . మల్టీ టాలెంటెడ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్గా ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ కానుంది . కాగా ఈ సినిమాకి పోటీగా ఒక్కరోజు ముందు కోలీవుడ్ స్టార్ హీరో వారసుడు సినిమా రిలీజ్ అవుతుంది . అంతేకాదు బాలయ్యకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చే హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా .. ఆయన సినిమా రిలీజ్ అయిన 24 గంటల తర్వాత రిలీజ్ కాబోతుంది.

 

ఇలా వరుసగా మూడు బిగ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కు సిద్ధం కావడంతో బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొంది . కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ఒంగోలులో వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది . ఈ క్రమంలోనే బాలయ్య చేసిన మంచి పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా స్టేజ్ పైకి వచ్చి ఎంతోమంది ప్రముఖులు పెద్దమనుషులు బాలయ్యను ఓ రేంజ్ లో పొగిడేసారు . కానీ అందరికన్నా హైలెట్గా నిలిచింది కమెడియన్ సప్తగిరి స్పీచ్ .

చాలా స్వీట్ గా ..చాలా షార్టుగా.. ఉన్నది ఉన్నట్లు నాలుగు ముక్కల్లో బాలయ్య అసలు స్వరూపం బయటపెట్టేసాడు. జై బాలయ్య అంటూ స్టార్ట్ చేసిన సప్తగిరి.. ఈ సినిమాలో పిలిచి మరి అవకాశం ఇవ్వడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు . “అంతేకాదు మీతో నటించడం ఎంతో ఆనందంగా ఉందని ..ఆ క్షణాలను మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు “. ఈ క్రమంలోనే సప్తగిరి లో బాలయ్యకు కామెడీ టైమింగ్ వచ్చేసిందని ..ఆ కారణంగానే అతగాడికి పిలిచి మరి అవకాశం ఇచ్చాడని .. ఇలా బాలయ్య తనకు నచ్చిన వాళ్ళకి టాలెంట్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా పిలిచి అవకాశం ఇస్తాడని నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే వీరసింహారెడ్డి జనవరి 12వ తేదీన బాక్సాఫీస్ లెక్కలను మార్చేస్తుంది అన్న మాత్రం వాస్తవం అంటూ రీసెంట్ ఈవెంట్లో తెలిసిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news