Moviesఎట్టకేలకు అసలు విషయం బయటపడిందోచ్.."ఐ లవ్ యూ చైతన్య"..అక్కినేని ఇంటికి కాబోయే...

ఎట్టకేలకు అసలు విషయం బయటపడిందోచ్..”ఐ లవ్ యూ చైతన్య”..అక్కినేని ఇంటికి కాబోయే కోడలు ఈమె.. !!

మనకు తెలిసిందే టాలీవుడ్ హీరో నాగచైతన్య హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . కాగా ఏం మాయ చేసావే సినిమా టైంలోనే వీళ్ల మనసులు కలిసాయి . అయితే కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమ వ్యవహారం నడిపించిన ఈ జంట తర్వాత ఇంట్లోని పెద్దలను ఒప్పించి గ్రాండ్గా గోవాలో పెళ్లి చేసుకున్నారు . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ జంట ఏడాది క్రితం విడాకులు తీసుకుని దూరం దూరంగా ఉంటున్నారు .

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇద్దరి గురించి లేని పోనీ వార్తలు వైరల్ అవుతున్నాయి. కొంతకాలం నుంచి అక్కినేని నాగచైతన్య హీరోయిన్ దివ్యాంకా కౌశిక్ ని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కినేని ఇంటికి కాబోయే కోడలు దివ్యాంకా కౌశిక్ అంటూ చాలా మంది చెప్పుకొచ్చారు .

వీళ్ళ మధ్య ఉన్న చనువు చూసి ఈ జంట నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఆశపడ్డారు. రీసెంట్ గా ఈ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యాంక కౌశిక్ అక్కినేని ఇంటికి కోడలు పై క్లారిటీ ఇచ్చింది . ఆమె మాట్లాడుతూ..” నాగు నాగచైతన్య అంటే ఇష్టమే..ఐ లవ్ చై..కానీ మేం పెళ్ళి చేసుకోవట్లేదు..జస్ట్ ఫ్రెండ్స్..” అంటూ క్లారిటీ ఇచ్చింది . దీంతో అక్కినేని నాగచైతనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు అంటూ చెప్పకనే చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news