Moviesబిగ్ షాకింగ్: సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ బ్యూటీ.. ఖంగుతిన్న...

బిగ్ షాకింగ్: సీక్రేట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ బ్యూటీ.. ఖంగుతిన్న ఫ్యాన్స్..!!

ఫైనల్లీ అభిమానులు ఊహించినట్లుగానే .. స్టార్ బ్యూటీ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా సీక్రెట్గా పెళ్లి పీటలు ఎక్కింది . గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నటువంటి ఈమె ఫైనల్లీ పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా గత కొంతకాలం నుంచి సత్యదీప్ మిశ్రాకు మసాబ్ గుప్తకు మధ్య ఏదో సంబంధం నడుస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి .

అయితే వాటిపై ఎటువంటి రియాక్షన్ ఇవ్వని మసాబా గుప్త.. సీక్రెట్ గా పెళ్లి చేసుకుని తన పెళ్లి తాలూకా ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా పంచుకునింది . “ప్రేమ, శాంతి ,సంతోషం అన్ని ఇక్కడే ఉన్నాయి . శాంతి స్వరూపుడైన సత్యదీప్ తో వివాహం జరగడం నాకు ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది” అంటూ ఇన్స్టాగ్రామ్ లో రాసుకోచ్చింది. దీనికి తగ్గట్టే వాళ్ళు పెళ్లి ఫోటోని జత చేసింది .

పెళ్లి బట్టలో మసాబా చాలా అందంగా ఉంది. లైట్ పింక్ కలర్ దుస్తుల్లో మెరిసిపోతుంది . సక్సెస్ఫుల్ డిజైనర్ గా కొనసాగుతున్న ఈమె నిర్మాత మధు మటేనా ను పెళ్లాడింది . కాగా వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా 2019లో విడాకులు ఇచ్చేసింది . అంతేకాదు సత్యదీప్ మిశ్రా కి కూడా ఇది రెండో పెళ్లే. గతంలో హీరోయిన్ అతిథి రావును పెళ్లాడిన ఈయన వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా 2013లో విడాకులు ఇచ్చేశాడు . కాగా ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియాలో వీళ్ళ పెళ్లి వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news