Movies100 కోట్ల కాదు 200 కోట్లు ఇచ్చిన అలా చేయను.. రాజమౌళి...

100 కోట్ల కాదు 200 కోట్లు ఇచ్చిన అలా చేయను.. రాజమౌళి తెగింపుకి దండం పెట్టాల్సిందే..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకునేలా చేసిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ దర్శకుధీరుడు రాజమౌళి. ఇతగాడి గురించి ఎంత చెప్పినా తక్కువే ..చెప్పే కొద్ది ఇంకా ఏదో చెప్పాలి అనిపిస్తుంది ..వినే వాళ్లకి ఇంకొంచెం చెప్తే బాగుండే అనిపిస్తుంది. అలాంటి ఓ చెరగని స్థాయిని సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి తనపై ముద్రించుకున్నాడు ఈ జక్కన్న . ఇప్పటివరకు రాజమౌళి ఎన్నో సినిమాలు తీశాడు. తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

కనీసం నెగిటివ్ టాక్ కూడా తెచ్చుకోలేదు . అలాంటి ఒక కమిట్మెంట్ తో కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ టాలీవుడ్ లోనే కాదు ..పక్క భాష ఇండస్ట్రీలను కూడా అట్రాక్ట్ చేస్తున్నాడు రాజమౌళి. కాగా రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి ..ప్రజెంట్ మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా పై కాన్ సెంట్రేషన్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యాయి .

కాగా మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా పూర్తి అవ్వగానే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన చేయనున్నారు . ఇదే టైంలో జక్కన్నకు నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా 100 కోట్లు ఆఫర్ చేస్తూ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేయమంటూ సలహా ఇచ్చింది . అయితే సెకండ్ కూడా ఆలోచించని రాజమౌళి 100 కోట్ల ఆఫర్ ని సునయాసంగా రిజెక్ట్ చేశాడు. మహేష్ బాబుతో సినిమా కంప్లీట్ అయ్యేవరకు నేను వేరే ఏ ప్రాజెక్టు ఒప్పుకోనని 100 కోట్లు కాదు 200 కోట్లు ఇచ్చిన ఆ పని చేయనని చెప్పేసాడు. దీంతో రాజమౌళి కమిట్మెంట్ కి దండం పెట్టేస్తున్నారు ఆయన ఫ్యాన్స్ . ఇలాంటి కమిట్మెంట్ ఉన్న డైరెక్టర్ నే కదా మనకు కావాల్సింది అంటూ గొప్పలు చెబుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news