Moviesసైలెంట్ షాకిచ్చిన పవిత్ర..పెళ్ళి చేసుకోబోతున్న మరో జబర్థస్త్ జంట..!!

సైలెంట్ షాకిచ్చిన పవిత్ర..పెళ్ళి చేసుకోబోతున్న మరో జబర్థస్త్ జంట..!!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై వచ్చే షోస్ టిఆర్పి రేటింగ్స్ కోసం షోలో కంటెస్టెంట్ గా ఉన్న వాళ్ళని ఓ రేంజ్ లో వాడేసుకుంటున్నారు . మరి ముఖ్యంగా జబర్దస్త్ , ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ షో లలో పాల్గొనే స్టార్స్ కంటెస్టెంట్స్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నట్లు సోషల్ మీడియాలో జనాలు కామెంట్ చేస్తున్నారు . కాగా ఇప్పటికే సుడిగాలి సుదీర్ – రష్మీ మధ్య ఏదో ఉంది అంటూ యూట్యూబ్ జంటగా పేరు సంపాదించుకున్న ఈ జంట ..ఇప్పటివరకు తమ ప్రేమ పెళ్లి విషయాన్ని చెప్పిందే లేదు .

కానీ తెర పై మాత్రం హాట్ రేంజ్ లో రొమాన్స్ చేస్తూ కుర్రాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు . ఇక తర్వాత వర్ష ఇమ్మానుయేల్ కూడా ఇదే రేంజ్ లో ఉన్నది లేనట్టు చిత్రీకరించి తమ మధ్య ప్రేమ ఉన్నట్లు స్కిట్స్ లో చూపించి టీఆర్పీలు బాగానే సంపాదించారు . ఇప్పుడు తాజాగా ఆలిస్టులోకి యాడ్ అయింది మరో జంట అంటూ సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి . జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా పాపులర్ అయిన పవిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో కామెడీ పంచెస్ వేస్తూ నవ్విస్తూ వల్గారిటీకి దూరంగా ఉండే పవిత్ర అంటే జనాలకు బాగా ఇష్టం . పద్ధతిగా ఉంటుంది చక్కగా మాట్లాడుతుంది మంచిగా స్కిట్స్ లో నవ్విస్తుంది అని జనాలు చెప్పుకొస్తూ ఉంటారు.

కాగా సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరైన పవిత్ర ..రీసెంట్గా తన చానల్లో ” మా పెళ్లి షాపింగ్ ” అంటూ పెట్టిన వీడియో నెంబర్ వన్ ట్రెండింగ్ లోకి వచ్చింది . పవిత్ర జబర్దస్త్ లోని స్కిట్స్ వేసే తేజను ప్రేమిస్తున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి . కాగా రీసెంట్గా పవిత్ర తన యూట్యూబ్ ఛానల్ లో మా పెళ్లి షాపింగ్ అంటూ పెట్టడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది .

ఇప్పటివరకు వీళ్ళ మధ్య ప్రేమ ఉన్నట్లు ..ఎప్పుడు బయట పెట్టలేదు . వీళ్ల మధ్య ప్రేమ ఉందా అన్న అనుమానము రాలేదు. సడన్గా ఇలా పెళ్లి షాపింగ్ అంటూ వీడియో పెట్టేసరికి హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది పవిత్ర. అయితే జబర్దస్త్ లో పవిత్ర తో పాటు తేజ కూడా కలిసి స్కిట్స్ చేసేవాడు. వీళ్ళ మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఇది మొత్తం టిఆర్పిఎస్ కోసమే కానీ నిజమైన ప్రేమ కాదు అంటూ జనాలు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఏది ఏమైనా సరే పవిత్ర లాంటి కమెడియన్ కూడా ఇలా పాపులారిటీ కోసం పెళ్లి అంటూ ఫేక్ వీడియోలను చేయడం అస్సలు బాగోలేదు అంటున్నారు జనాలు . చూడాలి మరి ఇది నిజంగా వీళ్లు టిఆర్పీల కోసమే చేసారా..? లేక నిజముగానే పెళ్లి చేసుకుంటున్నారా..? మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news