Moviesఅఫీషియ‌ల్‌: బాల‌య్య వీర‌సింహారెడ్డితో విజ‌య్ వార‌సుడు ఫైట్‌.. చిరు వీర‌య్య వెన‌క్కి...!

అఫీషియ‌ల్‌: బాల‌య్య వీర‌సింహారెడ్డితో విజ‌య్ వార‌సుడు ఫైట్‌.. చిరు వీర‌య్య వెన‌క్కి…!

టాలీవుడ్‌లో వ‌చ్చే సంక్రాంతి స‌మ‌రం ఏ రేంజ్‌లో ఉండ‌బోతోందో చూస్తూనే ఉన్నాం. ఇద్ద‌రు పెద్ద హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ న‌టిస్తోన్న రెండు క్రేజీ ప్రాజెక్టులు వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి రెండూ థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. ఇక ఈ రెండు సినిమాల‌కు పోటీగా కోలీవుడ్ స్టార్‌హీరో ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తోన్న వార‌సుడు సినిమా కూడా సంక్రాంతి రేసులోనే ఉంది. మామూలుగా విజ‌య్ మ‌న హీరో కాదు.. ఇది డ‌బ్బింగ్ సినిమా లెక్క‌… దీనిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం ఉండేదే కాదు.

అయితే ఈ సినిమా నిర్మాత మ‌న తెలుగు టాప్ ప్రొడ్యుస‌ర్ దిల్ రాజు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న ఈ సినిమాకు తెలుగు డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు కాగా.. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. అందుకే ఈ సినిమాను కూడా ఇద్ద‌రు పెద్ద హీరోల సినిమాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని రేంజ్‌లో రిలీజ్ చేస్తున్నారు. పైగా దిల్ రాజు చేతిలో ఏపీ, నైజాంలో మంచి థియేట‌ర్లు ఉండ‌డంతో ఇప్పుడు చిరు, బాల‌య్య సినిమాల‌ను మించి టాప్ థియేట‌ర్లు అన్నీ వారసుడికే ద‌క్క‌నున్నాయి.

వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి రెండు సినిమాల రైట్స్ ఎవ్వ‌రికి ఇవ్వ‌కుండా మైత్రీ వాళ్లు ఓన్‌గా రిలీజ్ చేసుకుంటున్నారు. ఇది కూడా దిల్ రాజు కోపానికి కార‌ణం కావ‌డంతో రాజు ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌డం లేదు. ఇక ఈ ట్ర‌యాంగిల్ ఫైట్‌లో వార‌సుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్ర‌పంచ వ్యాప్తంగా వార‌సుడును జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేస్తున్న‌ట్టు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ఈ సినిమాను ఓవ‌ర్సీస్‌లో రిలీజ్ చేస్తోన్న శ్లోక ఎంట‌ర్టైన్‌మెంట్స్ ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది.

అయితే అదే రోజు బాల‌య్య వీర‌సింహారెడ్డి కూడా రిలీజ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. అంటే బాల‌య్య సినిమా, విజ‌య్ సినిమా ఒకే రోజు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ‌నున్నాయి. అంటే ఆ మ‌రుస‌టి రోజు చిరు వాల్తేరు వీర‌య్య రానుంది. మ‌రి ఈ ముగ్గురు క్రేజీ హీరోల సినిమాల్లో ఎవ‌రు పై చేయి సాధిస్తార‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news