Moviesచావుబ్రతుకుల మధ్య జబర్ధస్త్ కమెడియన్..కండీషన్ క్రిటికల్..!?

చావుబ్రతుకుల మధ్య జబర్ధస్త్ కమెడియన్..కండీషన్ క్రిటికల్..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే బుల్లితెరపై జబర్దస్త్ అనే షో ఎంత పాపులారిటీ దక్కించుకుందో. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేని కమెడియన్స్ కు సైతం అవకాశాలు ఇచ్చి తమకంటూ లైఫ్ ని క్రియేట్ చేసింది . చాలా కష్టాల్లో ఉన్న కమెడియన్స్ జబర్దస్త్ షో ద్వారానే ఫామ్ లోకి వచ్చి నాలుగు రూపాయలు వెనక వేసుకొని ఇల్లు కట్టుకుని కార్లు కొనుక్కున్నాడు .అంటే అది మొత్తం జబర్దస్త్ పుణ్యమే. కాగా గత కొన్ని రోజులుగా జబర్దస్త్ పేరు సోషల్ మీడియాలో పలు విధాలుగా ట్రోల్ అవుతుంది. జబర్దస్త్ లో జరిగేవి అన్ని మోసాలని ..కుట్ర కుతంత్రాలు ఎక్కువ అని చెప్పుకొస్తున్నారు .

అయితే దీనిపై ఏమాత్రం స్పందించని మల్లెమాల తన పని తను చేసుకుపోతుంది. కాగా రీసెంట్గా జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తూ కమెడియన్గా పాపులారిటీ సంపాదించుకున్న వినోద్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది మనకు తెలిసిందే. జబర్దస్త్ లో లేడీ గెటప్ వేసే వినోద్ అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. తనదైన స్టైల్ లో పంచెస్ వేస్తూ వల్గారిటీకి చాలా దూరంగా ఉండే వినోద్ పద్ధతిగా జబర్దస్త్ లో పేరు సంపాదించుకున్నాడు. కాగా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినోద్ తన హెల్త్ కండిషన్ గురించి ఓపెన్ అప్ అయ్యాడు.

ఆయన కొన్ని హెల్త్ సమస్యల కారణంగా బాధపడ్డారని ..ఈ క్రమంలోనే మెడిసిన్స్ తీసుకున్న గాని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడని .. అంతేకాదు దీని ద్వారా ఆయన చాలా వీక్ అయ్యాడని చెప్పుకొచ్చారు . అంతేకాదు ప్రజెంట్ ఆయన చాలా తక్కువ ఫుడ్ తింటున్నాడని.. ఈ కారణంగానే నీరసంగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చారు. జబర్దస్త్ వినోద్ కి ఊపిరితిత్తుల్లో వాటర్ ఫామ్ అయ్యి చాలా ఇబ్బంది చేసిందట. అంతేకాదు కండిషన్ క్రిటికల్ అయ్యి దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాడట .

ఈ సమస్య వచ్చిన టైంలో తన ఫ్యామిలీ తనకు చాలా సపోర్ట్ గా నిలిచిందని ..ఎంత కష్టమైనా సరే ఫ్యామిలీ మొత్తం తనకు అండగా నిలబడడం చాలా హ్యాపీగా అనిపించదని చెప్పుకొచ్చాడు. జంక్ ఫుడ్స్ ఎక్కువుగా తినడం ద్వారానే తనకి ఈ సమస్య ఉందని గుర్తించిన వినోద్ ..ఆలస్యం చేయకుండా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని తన ప్రాణాలను కాపాడుకున్నాడు . కాగా ఊపిరితిత్తుల్లో వాటర్ ఫామ్ అయిన టైంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడని..చావు అంచుల వరకు వెళ్లి ఎటువంటి సమస్య లేకుండా వినోద్ ఆ సమస్య నుంచి కోరుకున్నాడని వినోద్ భార్య చెప్పుకొచ్చింది. ఏది ఏమైనా సరే ప్రజెంట్ వినోద్ ఆరోగ్యంగా ఉన్నాడు ..అదే చాలు. హెల్త్ గురించి కేర్ తీసుకొని జబర్దస్త్ లో మళ్లీ స్కిట్స్ వేయి అంటూ ఫ్యాన్స్ సజీషన్స్ ఇస్తున్నారు. చూడాలి మరి వినోద్ స్కిట్స్ మళ్లీ మనం తెరపై ఎప్పుడు చూస్తామో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news