Moviesదమ్మిడి లాభం లేకపోయినా ..కృతి బిగ్ ఆఫర్స్ అందుకోవడానికి ఏకైక రీజన్...

దమ్మిడి లాభం లేకపోయినా ..కృతి బిగ్ ఆఫర్స్ అందుకోవడానికి ఏకైక రీజన్ ఇదే..ఏం అదృష్టమే తల్లి!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన డైరెక్షన్లో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . అంతేనా ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాల కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో కృతి ఖాతాలో బిగ్ స్టార్స్ ఆఫర్స్ ఎక్కువయ్యాయి .

కాగా ఫస్ట్ మూడు సినిమాలు ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయో.. ఆ తర్వాత నటించిన మూడు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . అయినా కానీ కృతి కి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మిగతా హీరోయిన్స్ కి కృతికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటా అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . సాధారణంగా ఏదైనా హీరోయిన్ కి రెండు సినిమాలు ఫ్లాప్ అయితేనే ఐరన్ లెగ్ అంటూ ముద్ర వేసేస్తారు. కానీ కృతి శెట్టి విషయంలో మాత్రం దానికి పూర్తి ఆపోజిట్ గా ఉంది. ఈ క్రమంలోని కృతి శెట్టి ఆఫర్స్ అందుకోవడానికి ఏకైక రీజన్ ఆమె ఏజ్ అంటూ చెప్పుకొస్తున్నారు.

చాలా చిన్న ఏజ్ లోనే సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చింది. చూడడానికి కొంచెం ముదురు ఫేస్ అనిపించినా సరే .. చాలా యంగ్ ఏజ్ లోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చినా ఈ బ్యూటీ కరెక్ట్ డైరెక్టర్ చేతిలో పడితే ఒక దశాబ్ద కాలం పాటు సినిమా ఇండస్ట్రీని ఏలేస్తే చాన్సేస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు . ఏది ఏమైనా సరే ఇండస్ట్రీలోకి ఇంత చిన్న ఏజ్ లో రావడం కూడా ఒక అదృష్టం ఎందుకంటే .. తమ ఏజ్ ముదిరిపోకముందే మంచి హీరోయిన్స్ గా పేరు సంపాదించుకోవచ్చు.. ఆఫర్స్ వెనకేసుకొని.. అకౌంట్ లో వేసుకోవచ్చు “అంటూ జనాలు కామెంట్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news