Moviesథమన్ తక్కువోడేం కాదు బాబోయ్..సింగర్స్‌ని అలా..?

థమన్ తక్కువోడేం కాదు బాబోయ్..సింగర్స్‌ని అలా..?

మ్యూజిక్ సెన్షేషన్‌గా ఎస్ ఎస్ థమన్‌కి ఎలాంటి పేరుందో ఇప్పుడు అందరికీ తెలిసిందే. దివంగ‌త లెజెండ్రీ సంగీత ద‌ర్శ‌కుడు ఘంట‌శాల బ‌ల‌రామ‌య్య మ‌న‌వ‌డే థ‌మ‌న్‌. నటుడవ్వాలనుకున్న థమన్ తనకు ఇష్టమైన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కూడా నటించాడు. అయితే, అందరూ థమన్‌ను నటుడిగా కంటే కూడా మ్యూజిక్ డైరెక్టర్‌గానే ఎంకరేజ్ చేశారు. అదే చేయమని సలహాలిచ్చారు. దాంతో థమన్ పూర్తి స్థాయిలో సంగీత దర్శకుడిగా మారాడు. కెరీర్ ప్రారంభం నుంచే పెద్ద హీరోల సినిమాలకి పనిచేసే అవకాశాలు అందుకుంటూ వస్తున్నాడు.

దీనికి కారణం ఆయన గురువు మెలోడి బ్రహ్మ మణిశర్మ. మణిశర్మ వద్ద శిష్యరికం చేసిన థమన్ ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్‌గా మారి ఎలాంటి సినిమాలకి సంగీతం అందిస్తున్నాడో అందరికీ తెలిసిందే. రవితేజకి ఎక్కువ సినిమాలు చేసిన థమన్..పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, రాం చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్..తమిళంలో విజయ్..బాలీవుడ్ మూవీస్ ఇలా..దాదాపు స్టార్ హీరోల సినిమాలకి వాయిస్తున్నాడు.

థమన్ మ్యూజిక్ అంటే డప్పుల మోత అనే పేరుంది. దాన్ని అధిగమించాడు థమన్. మెలోడీ సాంగ్స్ ఇస్తూ ఒక సపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడున్న అందరు సంగీత దర్శకుల్లోనూ థమన్ చాలా ప్రత్యేకం. లిరికల్ వీడియో ఫార్మాట్‌ను కూడా మార్చిన ఘనత థమన్‌ది. ఇంత మంచి పేరున్నా కూడా కాపీ క్యాట్ అనే ట్యాగ్ తగిలించారు. దీనికి కారణం తన ట్యూన్స్ తనే కాపీకొట్టుకోవడం.

సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. అయినా ఈ విషయంలో మారడం లేదు. ఇదిలా ఉంచితే..తన వద్ద పాడే ఫీమేల్ సింగర్స్ మీద కాస్త వెరైటీగా బిహేవ్ చేస్తాడని టాక్ ఉంది. పాట విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే థమన్..పాటకి సింగర్ సెలక్షన్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు.

ఇది బాగానే ఉంది. అయితే, థమన్ సింగర్స్ మీద బాగానే మనసు పారేసుకుంటాడట. అది ఏరకంగానో బయటకి రాలేదు గానీ, సింగర్స్‌ను వాడకంలో థమన్‌ని మంచి హ్యాండ్ అని లోలోపల టాక్ వినిపిస్తోంది. మరి అది ఏంటో ఎప్పుడు బయటకి వస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news