Moviesస్టార్ హీరో కూతురు జీవితం నాశనం ..విశ్వక్ సేన్ కి మంచు...

స్టార్ హీరో కూతురు జీవితం నాశనం ..విశ్వక్ సేన్ కి మంచు విష్ణు సీరియస్ వార్నింగ్..!?

విశ్వక్ సేన్.. ఈ మధ్యకాలంలో ఈ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. మరికొన్నిసార్లు వైరల్ అవుతుంది. దానికి ముఖ్య కారణం విశ్వక్ సేన్ బిహేవియర్ . ఎటువంటి సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి హీరో అవుదామని వచ్చి తన స్థాయి శక్తుల ట్రై చేస్తున్న విశ్వక్ సేన్ గతంలో తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రాంక్ వీడియో చేసి నానా రచ్చ చేశారు. ఇక తర్వాత ఓరి దేవుడో సినిమాతో పాజిటివ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విశ్వక్ సేన్.. గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ అవుతున్నాడు.

దానికి కారణం ఆయన తదుపరి సినిమా నుండి తప్పుకోవడమే . విశ్వక్ సేన్ కథానాయకుడిగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . ఈ సినిమాలో అర్జున్ డాటర్ నటిస్తుంది. ఐశ్వర్య ఈ సినిమా ద్వారానే తెలుగులో ఎంట్రి ఇస్తుంది. ఈ సినిమా నుండి విశ్వక్ సేన్ తప్పుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఫైర్ అయిపోయిన అర్జున్… విశ్వక్ సేన్ కు చాలా విధాలుగా సినిమాలో నటించమని నచ్చ్జెప్పాడు.

కానీ విశ్వక్ సేన్ తగ్గలేదు.. వీరి పరస్పర ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి . అయితే తాజా సమాచారం ప్రకారం విశ్వక్ సేన్ తీరుపై హీరో అర్జున్ మా అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేశాడని ..ఈ సందర్భంగా మంచు విష్ణు విశ్వక్ సేన్ పై మండిపడ్డారని తెలుస్తుంది. ” మీలాంటి సీనియర్ హీరోని ఇంతలా బాధపెట్టిన ఈ యంగ్ హీరోను వదలను అసలు ప్రాబ్లం ఏంటి ..? మీ సినిమా ఎందుకు చేయలేకపోతున్నాడు ..? తెలుసుకుని కనుకుంటాను..రీజన్ సరైనదైతే నేను బలవంతం చేయను.. ఒకవేళ రీజన్ చెత్తది అయితే మాత్రం అతడికి తాట తీసేస్తాను.. తోక కత్తిరిస్తా” అంటూ వార్నింగ్ ఇచ్చాడట . అంతేకాదు ఎలాగైనా సరే మీ సినిమా ముందుకు వెళ్తుంది అంటూ విష్ణు హామీ ఇచ్చాడట . ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news